శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై, తాన్యా, గిరీష్ మరియు కే కే, ముఖ్య తారాగణం తో ఉదయ్ కుమార్ సి హెహ్ దర్శకత్వంలో బి బాపిరాజు నిర్మిస్తున్న చిత్రం “అంజలి టాకీస్”. ఈ చిత్రం అంజలి టాకీస్ అనే సినిమా హాల్ లో జరిగే ఒక హారర్ కథ. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “అంజలి టాకీస్” ఒక థియేటర్ లో జరిగే హారర్ సస్పెన్స్ కథ. ఈ చిత్రం లో పని చేసిన నటీనటులు అద్భుతంగా జీవించారు. ప్రతి సన్నివేశం తర్వాత ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రతి ప్రేక్షకులకు కలుగుతుంది. షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం” అని తెలిపారు.

, , , , , , , , , ,