Advertisement
అల్లు అర్జున్ ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్ – దర్శకుడు రాజమౌళి
Latest Movies Tollywood

అల్లు అర్జున్ ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్ – దర్శకుడు రాజమౌళి

Advertisement

యువ నటులకు అల్లు అర్జున్ ఇన్సిపిరేషన్ గా ఉంటాడన్నారు దర్శకుడు రాజమౌళి. పుష్ప ప్రీ రిలీజ్ లో అతిథిగా పాల్గొన్న ఈ దర్శకధీరుడు..సినిమా కోసం అల్లు అర్జున్ లా కష్టపడటాన్ని కొత్త నటులు నేర్చుకోవాలన్నారు. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్ అని రాజమౌళి ప్రశంసించారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ కోసం ముంబై వెళ్లినప్పుడు అక్కడ వాళ్లకు కూడా పుష్ప సినిమా మోస్ట్ అవేటెట్ మూవీ అని చెప్పారని, పుష్పకున్న క్రేజ్ దీన్ని బట్టి తెలుస్తుందన్నారు రాజమౌళి.

నేషనల్ వైడ్ పుష్ప చిత్రానికి ఉన్న క్రేజ్ ను నిలబెట్టేలా ప్రమోషన్ చేయాలని రాజమౌళి టీమ్ కు సూచించారు. సుకుమార్ తనకు ఇష్టమైన దర్శకుడని, తామిద్దరం ఎప్పుడూ టచ్ లో ఉంటామని రాజమౌళి చెప్పారు. రాజమౌళికి అల్లు అర్జున్ హగ్ ఇచ్చి తన కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement