టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ నేడు తెలంగాణ గవర్నర్‌  తమిళిసై గౌరవప్రదంగా కలిసి ముచ్చటించారు

. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. రీసెంట్ గా ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని  గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ  స్వయంగా వివాహానికి రావాలని  ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.

, , , , , , ,