తన హాట్ హాట్ లుక్స్ తో బుల్లితెరను హీటెక్కించి ఆ విషయంలో ట్రెండ్ సెట్టర్ అయిన బ్యూటీ అనసూయ. విశేషం ఏంటంటే.. పెళ్లైన తర్వాతే తను ఈ లుక్స్ లోకి మారింది. హాట్ ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే వాక్చాతుర్యం కూడా ఉండటంతో అతి తక్కువ టైమ్ లోనే ఫేమ్ అయింది. తను ఫీలైనా ఖచ్చితమైన వాస్తవం ఏంటంటే.. తను ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది మాత్రం కేవలం స్కిన్ షోతోనే. తర్వాత ఇదో ట్రెండ్ మారింది. కొత్తగా వస్తోన్న యాంకర్స్ కూడా తనలానే కనిపించాలనే కండీషన్స్ కూడా మొదలయ్యాయి. అలా ఆమె బాటలో తర్వాత రష్మి వచ్చింది. ప్రస్తుతం రష్మి కాస్త పద్ధతిగానే కనిపిస్తున్నా.. అనసూయ మాత్రం తగ్గేదే లేదని రెచ్చిపోతూనే ఉంది.
బుల్లితెరపైనే కాక తన సోయగాలు అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తూ ఉంటాయి. అయితే స్కిన్ షోతో పాటు తనలో మంచి నటి కూడా ఉందని క్షణం, రంగస్థలం వంటి చిత్రాలతో నిరూపించుకుంది. ఆ మేరకు చాలా అవకాశాలు వచ్చినా.. సినిమాల వరకూ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా వచ్చిన ఖిలాడీలో నటించింది. ఖిలాడీలో మొదటి సగంలో రవితేజకు అత్తగా నటించి ఆశ్చర్యపరచింది. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేసింది. ఇప్పటి వరకూ అనసూయను ఇలాంటి పాత్రలో చూడలేదంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్లను మించిన ఎక్స్ పోజింగ్ అది. ఇలాంటి పాత్ర తను ఎప్పుడో చేయాల్సింది అని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకుంది. కానీ వయసు మళ్లుతోన్న టైమ్ లో చేసిన ఈ ఎక్స్ పోజింగ్ అంతా ఖిలాడీ డిజాస్టర్ వల్ల వృథా అయింది.
ఫస్ట్ హాఫ్ లో ట్రెడిషనల్ గా, సెకండ్ హాఫ్ లో బోల్డ్ గా నటించిన అనసూయను చూసి ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ.. నిజానికి ఆ పాత్రకు అంత బోల్డ్ నెస్ అక్కర్లేదు. అయినా ఆ రేంజ్ లో రెచ్చిపోయిందంటే తనకు అలాంటి పాత్రలంటే ఇంకా మక్కువ ఉందని ఇతర మేకర్స్ కు చెప్పకనే చెప్పిందనుకోవచ్చు. పోనీ ఇంత బోల్డ్ రోల్ లో ఏమైనా నటనకు ఆస్కారం ఉందా అంటే అదీ లేదు. ఏదో ఓ వ్యాంప్ లా.. తెలుగు సినిమాల్లో దుబాయ్ లో ఉండే విలన్స్ పక్కన ఉన్న తెల్ల పిల్లలు చిన్న బట్టలు వేసుకున్నట్టుగా కనిపించింది అంతే. ఓ రకంగా ఫస్ట్ హాఫ్ లో తన పాత్ర బానే అనిపించినా.. సెకండ్ హాఫ్ మరీ సెట్ ప్రాపర్టీలా మారిందంటే తను ఎంత చీప్ రోల్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

, , , , , , , , ,