Advertisement
అఖండ – రివ్యూ
Latest Movies Reviews Tollywood

అఖండ – రివ్యూ

Advertisement

నటీనటులు – బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, సాయి కుమార్, పూర్ణ, ప్రవీణ్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – సి. రామ్ ప్రసాద్, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం – ఎస్ఎస్ థమన్, నిర్మాత – మిర్యాల రవీందర్ రెడ్డి, రచన దర్శకత్వం – బోయపాటి శ్రీను

ఈ సీజన్ లో భారీ చిత్రంగా తెరపైకి వచ్చింది అఖండ. అఖండ అనే కొత్త క్యారెక్టరైజేషన్ తో సినిమా తెరకెక్కడం ఈ సినిమాకు హైలైట్ కాగా..ఈ క్యారెక్టర్ లీడ్ తో టాలీవుడ్ లో సినిమా రావడమూ కొత్తే. ఈ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో మరో కీలక పాయింట్ కూడా పెట్టడం సినిమాకు బలంగా మారింది. ఆ అంశమే లేకుంటే అఖండ తేలిపోయేదే. ఆ కీలక అంశం చుట్టూ అల్లిన అఖండ క్యారెక్టర్, మెయిన్ స్టోరీ ఎలివేట్ అవడం అఖండను అంచనాలు అందుకునేలా చేసింది.

ఫ్లస్ పాయింట్స్

అఖండ గా బాలకృష్ణ
మాస్ ఎలిమెంట్స్
థమన్ మ్యూజిక్
గ్రాండ్ మేకింగ్
శ్రీకాంత్ నటన

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్
కొన్ని పాత్రలు

బాలకృష్ణ చేసిన రెండు క్యారెక్టర్స్ లో కలెక్టర్ ప్రగ్యా జైశ్వాల్ భర్త మురళి పాత్ర ఒకటి, అఖండ రెండోది. మొదటి పాత్రను లైటర్ వేన్ లో తీసుకెళ్లిన దర్శకుడు అఖండను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. ఖనిజాల మైనింగ్ చేసే శ్రీకాంత్ ఆ మైనింగ్ ముసుగులో కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టే యురేనియం తవ్వకాల చేయిస్తాడు. యురేనియం తవ్వకాల సమయంలో ఏర్పడే కలుషిత నీటిని మళ్లీ భూమిలోకే పంపిస్తుంటాడు. దీని వల్ల భూగర్భ జలాలు కాలుష్యమై పిల్లలు, సాధారణ జనం అనారోగ్యం పాలవుతారు. ప్రజల ప్రాణాలు తీసే ఈ అక్రమ మైనింగ్ ను అఖండ ఎలా ఎదుర్కొన్నాడు ఎలా ఆపాడు అనేది అసలు కథ.

మురళీ పాత్రలో బాలకృష్ణకు నటించేందుకు పెద్ద స్కోప్ లేదు. కానీ అఖండ క్యారెక్టర్ కు వచ్చేప్పటికి ఆయన మేకోవర్, అప్పీయరెన్స్, పర్మార్మెన్స్ అన్నీ అదిరిపోయాయి. అఖండ పలికిన ప్రతి డైలాగ్ థియేటర్ లో మాస్ ను ఊపేస్తోంది. ముఖ్యంగా శ్రీకాంత్ తో అఖండ ఫేస్ టు ఫేస్ సీన్స్ దద్దరిల్లిపోయాయి. శ్రీకాంత్ కు ఈ చిత్రంతో అప్పట్లో లెజెండ్ లో జగపతి బాబుకు వచ్చినంత పేరు రావడం ఖాయం. ఆయన క్యారెక్టర్ అంత బాగా కుదిరింది. ప్రగ్యా జైశ్వాల్ కు ఉన్నంతలో బాగా నటించింది. థమన్ నేపథ్య సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. థమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ థీమ్ ను ఎలివేట్ చేసింది. వినయ విధేయ రామ చిత్రంతో తనకొచ్చిన బ్యాడ్ నేమ్ ను బోయపాటి ఈ సినిమాతో తుడిచేసుకున్నట్లే.

రేటింగ్ 3.75/5

Advertisement