Advertisement
వీక్ డేస్ లో కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న *”అఖండ‌”
Latest Movies Tollywood

వీక్ డేస్ లో కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న *”అఖండ‌”

Advertisement

అఖండ‌.. అఖండ‌.. అఖ‌డ‌… ఎక్క‌డా చూసినా ఇదే మాట‌. డిసెంబ‌ర్ 2 అన‌గా గురువారం విడుద‌లైన అఖండ సినిమా ఆదివారం వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీగా వసూళ్లు రాబ‌ట్టింది. ఇక సోమ‌వారం అఖండ‌కు అస‌లైన ప‌రీక్ష అని.. క‌లెక్ష‌న్స్ త‌గ్గే ఛాన్స్ ఉంద‌ని అనుకుంటే.. సోమ‌వారం కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. ట్రేడ్ వ‌ర్గాలు కూడా అఖండ క‌లెక్ష‌న్స్ చూసి షాక్ అవుతున్నారంటే.. క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.

బాల‌య్య సినిమాలు అంటే.. బి, సి ఏరియాల్లో క‌లెక్ష‌న్స్ బాగుంటాయి కానీ.. అఖండ ఏ సెంట‌ర్స్ లో కూడా అద‌ర‌గొట్టేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో వీక్ డేస్ లో ఏ ఒక్క సినిమాకు రాని విధంగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. నైజాంతో పాటు ఏపీలో పలు సెంటర్ల వద్ద భారీ ఎత్తున జనాలు బారులు తీరారు అని స‌మాచారం. నైజాంలో ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ లోనే లాభాలు బాట‌ప‌ట్టింది.

అందుక‌నే నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు అఖండ టీమ్ కి బిగ్ పార్టీ ఇచ్చార‌ట‌. సోమ‌వారం క‌నిపించిన క‌లెక్ష‌న్ ల జోరు శుక్రవారం వరకు కొనసాగితే మళ్లీ శని ఆదివారాల్లో అఖండ భారీ వసూళ్లు నమోదు చేయ‌డం ఖాయం. దీంతో బాలయ్య కెరీర్ లోనే టాప్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వీక్ డేస్ లో అఖండ స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో కేవలం ఇది సాదారణ విజయం కాదంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి.. లాంగ్ ర‌న్ లో అఖండ ఇంకెంత క‌లెక్ట్ చేస్తుందో..? ఎలాంటి రికార్ట్ సెట్ చేస్తుందో చూడాలి.

Advertisement