Advertisement
“అఖండ” కలెక్షన్స్ అన్నీ బాలకృష్ణ ఇమేజ్ మీద వస్తున్నవే – నిర్మాత సి. క‌ళ్యాణ్‌
Latest Movies Tollywood

“అఖండ” కలెక్షన్స్ అన్నీ బాలకృష్ణ ఇమేజ్ మీద వస్తున్నవే – నిర్మాత సి. క‌ళ్యాణ్‌

Advertisement

టికెట్ రేట్ల తగ్గింపు, కరోనా భయం ఉన్నా అఖండకు ఇంత కలెక్షన్స్ వస్తున్నాయంటే కారణం బాలకృష్ణ ఇమేజ్ అంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. బాలకృష్ణతో పరమవీరచక్ర, జైసింహ, రూలర్ మూడు చిత్రాలు నిర్మించారు సి కళ్యాణ్. తాజగా అఖండ విజయం గురించి సి కళ్యాణ్ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ..ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. అఖండను మిర్యాల రవీందర్ రెడ్డి పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్. రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. శంకరాచార్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయనకు కూడా చేయాలనుకుంటున్నారు. మేం ఆయన్ను అలా చూడాలని అనుకుంటున్నాం. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను. అన్నారు.

Advertisement