Advertisement
బాల‌య్య “అఖండ” 6 రోజుల క‌లెక్ష‌న్స్
Latest Movies Tollywood

బాల‌య్య “అఖండ” 6 రోజుల క‌లెక్ష‌న్స్

Advertisement

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ లేటెస్ట్ సెన్సేష‌న్ అఖండ‌. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను అఖండ చిత్రాన్ని అంచ‌నాల‌కు మించి ఉండేలా తెర‌కెక్కించారు. అందుక‌నే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. వ‌ర్కింగ్ డేస్ లో కూడా అఖండ‌ మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. మాస్ సెంట‌ర్స్ లో రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతున్న అఖండ క్లాస్ సెంట‌ర్స్ లో ఫ‌ర‌వాలేదు అనిపించే క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది. ఐద‌వ రోజుతో పోలిస్తే.. ఆర‌వ రోజు కూడా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది.

గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో దూసుకెళుతున్న ఈ సినిమా ఈస్ట్, వెస్ట్ ఏరియాల్లో కూడా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఇక నైజాంలో ఫ‌స్ట్ వీక్ లోనే లాభాల బాట‌ప‌ట్టింది. ముఖ్యంగా హైద‌రాబాద్ లో ఎక్క‌డా డ్రాప్ అవ్వ‌కుండా భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రెండున్న‌ర కోట్ల షేర్ సాధించే ఛాన్స్ ఉందంటున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఆర‌వ రోజు రెండున్న‌ర నుంచి 3 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని సినీ పండితులు చెబుతున్నారు.

మొద‌టి నాలుగు రోజులు అంచ‌నాల‌ను మించి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. వ‌ర్కింగ్ డేస్ లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే వ‌సూలు సాధిస్తున్న అఖండ వ‌ర్కింగ్ డేస్ లో కూడా క‌లెక్ష‌న్స్ జోరు చూపిస్తుండ‌డంతో చిత్ర‌య‌నిట్ తెగ సంబ‌ర‌ప‌డుతుంది. ఈ క‌లెక్ష‌న్ ల జోరు ఇలాగే కొన‌సాగితే.. ఫుల్ ర‌న్ లో అఖండ స‌రికొత్త రికార్డ్ సృష్టించ‌డం ఖాయం.

Advertisement