Advertisement
ఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ తో దుమ్ములేపిన “అఖండ‌”
Latest Tollywood

ఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ తో దుమ్ములేపిన “అఖండ‌”

Advertisement

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తాజా సంచ‌ల‌నం అఖండ‌. ఈ చిత్రానికి ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత చేసిన సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే అఖండ అద్భుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ దూసుకెళుతుంది.

అఖండ ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్ అండ్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ తోనే సంచ‌ల‌నం సృష్టించింది. ఫ‌స్డ్ డేనే అఖండ యు.ఎస్ లో 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేయ‌డం ఖాయం అనిపించింది. ఇప్పుడు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా 1 మిలియ‌న్ మార్క్ ను అందుకుంది. క‌రోనా వ‌ల‌న‌ యు.ఎస్ లో సినిమాల‌కు ఆద‌ర‌ణ బాగా త‌గ్గింది. ఇలాంటి టైమ్ లో యు.ఎస్ లో తెలుగు సినిమాల‌కు ఆద‌ర‌ణ ఎలా ఉంటుందో..? ఎప్పుడు ట్రాక్ లోకి వ‌స్తుందో అనుకున్నారు. అయితే.. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత రిలీజైన జాతిర‌త్నాలు, ల‌వ్ స్టోరీ సినిమాల‌కు బాగానే ఆద‌ర‌ణ ల‌భించింది.

ఇప్పుడు భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ కూడా భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం విశేషం. అఖండ త‌ర్వాత రిలీజైన నాగ‌శౌర్య ల‌క్ష్య‌, గ‌మ‌నం చిత్రాలు ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో సెకండ్ వీక్ లో కూడా అఖండ జోరు కొన‌సాగింది. దీంతో అఖండ ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి బాల‌య్య సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా అఖండ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం విశేషం.

Advertisement