Advertisement
అజిత్.. అదరగొట్టావ్ గురూ..
Latest Movies Regional Tollywood

అజిత్.. అదరగొట్టావ్ గురూ..

Advertisement
కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకడు అజిత్ కుమార్. హ్యాండ్సమ్ హీరోగా ప్రేమకథలతో ప్రయాణం మొదలుపెట్టిన అజిత్.. తనకంటూ ఓ సెటిల్డ్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ ఏర్పడిన తర్వాత యాక్షన్ సినిమాలవైపు టర్న్ అయ్యాడు. ఆ విషయంలో కూడా బాగా సక్సెస్ అయ్యి ఇప్పుడు మాస్ హీరోగా తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. తన సినిమాల్లో చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్ ను తనే చేస్తాడు అజిత్. ముఖ్యంగా అజిత్ ప్రొఫెషనల్ బైక్ రేసర్. తనొక్కడే బైక్ పై దేశాన్ని చుట్టి వచ్చేంత పిచ్చి కూడా ఉంది. అందుకే ఆ తరహా ఫైట్స్ ఉంటే డూప్ తో పనే ఉండదు అతనికి. ప్రస్తుతం అతను వాలిమై(శక్తి) అనే సినిమా చేస్తున్నాడు. మన తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. అయితే.. మామూలుగా కొత్తగా వచ్చే సినిమాలకు సంబంధించి పాటలు, టీజర్స్ లేదా ట్రైలర్స్ విడుదల చేస్తారు. వీళ్లు మాత్రం కొత్తగా ముందే ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు.
ఈ మేకింగ్ వీడియో చూస్తోంటే అజిత్ ఏ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ లను చేశాడో అర్థమవుతుంది. అలాగే ఇలాంటి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు వాలిమై విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడనీ తెలుస్తోంది. ఇటు కార్తికేయ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యతే ఉన్నట్టు కనిపిస్తోంది. యాక్షన్ పరంగా ఓ రేంజ్ లో కనిపిస్తోన్న ఈ మూవీలో బైక్ రేసింగ్స్ ప్రధానంగా ఉన్నట్టున్నాయి. అందుకే అజిత్ ఈ పాత్రను మనసు పెట్టి చేశానని చెప్పుకున్నాడు.
విశేషం ఏంటంటే.. షూటింగ్ లో అజిత్ ఓ బైక్ స్టంట్ చేస్తుండగా అది స్కిడ్ అయింది. అయినా కాసేపటికి అతను లేచి నిలుచున్నాడు. నడుస్తూ ఓ పక్కకు వెళ్లాడు. దీనికి విజయమో వీర స్వర్గమో.. అంతేకానీ మధ్యలో ఆగిపోకూడదు అని గాంధీ స్టేట్మెంట్ ను జోడించారు.

మొత్తంగా ఈ మేకింగ్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. గతంలో శతురంగవేట్టై, ఖాకీ చిత్రాలను రూపొందించిన హెచ్ వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అజిత్ సరసన(అనొచ్చా) బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించింది. వినోద్ కుమార్ ఈ చిత్రంకంటే ముందు అజిత్ తో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను రీమేక్ చేస్తూ నీర్ కొండ పార్వై అనే సినిమా చేశాడు. ఆ టైమ్ లో వినోద్ వర్కింగ్ స్టైల్ నచ్చే అజిత్ ఈ ఛాన్స్ ఇచ్చాడు.

Advertisement