ad

తమిళ్ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తో వెలుగుతున్నాడు అజిత్ కుమార్. ఇంత స్టార్డమ్ ఉన్న అజిత్ కు ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉండదు. తన అభిమాన సంఘాలను కూడా రద్దు చేసుకున్నాడు. పైగా తన బిరుదుగా చెప్పుకునే ‘తలా’అనే పేరును కూడా తొలగించుకున్నాడు. ఇకపై తనను అలా పిలవొద్దని అందరికీ చెప్పాడు. ఆ పేరు తెరపై పడకుండా వస్తోన్న ఫస్ట్ మూవీనే వలిమై(తెలుగులో శక్తి అని అర్థం). గతంలో కార్తీతో ఖాకీ అనే సూపర్ హిట్ సినిమా తీసిన హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఖాకీ తర్వాత అతను అజిత్ తోనే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ చిత్రాన్ని తమిళ్ లో నీర్ కొండ పార్వై పేరుతో రీమేక్ చేశాడు. ఆ టైమ్ లోనే వినోద్ వర్కింగ్ స్టైల్ నచ్చిన అజిత్ మరో అవకాశం ఇచ్చాడు. అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా వలిమై.
వలిమైని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు అందర్లానే కరోనా కారణంగా వాయిదా వేశాడు. ప్రస్తుతం టాప్ హీరోలంతా తమ సినిమాల విడుదల తేదీలను హడావిడీగా అనౌన్స్ చేస్తున్నారు. ఓ రకంగా చాలా విజృంభిస్తుందని భావించిన కరోనా ఈ సారి పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో అందరూ మళ్లీ రొటీన్ లైఫ్ లో పడిపోతున్నారు. సినిమాలు కూడా థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వలిమైని కూడా ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఆ మధ్య విడుదల చేసిన వలిమై ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. మామూలుగా అజిత్ కు బైక్ రేసింగ్ లంటే ఇష్టం. ప్రొఫెషనల్ బైక్ రేసర్ గానూ ఆకట్టుకున్నాడు. అలాంటి అజిత్ తో పూర్తిగా బైక్ రేసింగ్ ల నేపథ్యంలో ఉన్న కథతోనే వస్తున్నారు. ప్రస్తుతం యాభైయేళ్లు పూర్తి చేసుకున్న అజిత్ ఈ వయసులో కూడా రియల్ స్టంట్స్ తో ఆకట్టుకున్నాడు. షూటింగ్ టైమ్ లో చాలాసార్లు కిందపడినా.. మళ్లీ కోలుకున్నాడు.
ఇక ఈ వలిమై చిత్రంలో మన తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించడం విశేషం. అతను కోలీవుడ్ ఎంట్రీ టాప్ స్టార్ తో ఉండటం విశేషం. మొత్తంగా తెలుగులోనూ విడుదల కాబోతోన్న వలిమై అజిత్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

, , , , , , , , , , , , , , , , , , , , ,