ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ నెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరోవైపు, కృష్ణంరాజు మరణం నుంచి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఇండస్ట్రీ పెద్దదిక్కును కోల్పోయామని సినీ ప్రముఖులు బాధ పడుతున్నారు. ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కుటుంబ ప్రభాస్ ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.

, , , , ,