జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానంటూ ఎక్కడా ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు కానీ, సన్నిహితుల దగ్గర అంటోందట నటి అమలాపాల్‌. రీసెంట్‌గా అమల ఇచ్చిన కంప్లయింట్‌ మీద సింగర్‌ భవీందర్‌సింగ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. హీరోయిన్లకు సోషల్‌ మీడియాలో రకరకాల వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకుని టైమ్‌ వేస్ట్ చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అసలు అలాంటివారిని లైట్‌ తీసుకోవడం కూడా అలవాటైపోయి ఉంటుంది మన నాయికలకు. అయితే, అమలాపాల్‌ ఎదుర్కొన్న సమస్య వేరు. కెరీర్‌ పీక్స్ లో ఉండగానే దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్‌.

వీరిద్దరి కాపురం మూడేళ్లుకూడా గట్టిగా నిలబడలేదు. విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా స్పిరిచువల్‌ జర్నీ చేసింది అమల. ఆ క్రమంలోనే ఆమెకు భవీందర్‌ అనే గాయకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు కూడా ఫొటోలు లీక్‌ అయ్యాయి. వారిద్దరు సన్నిహితంగా ఉన్నట్టు కూడా చాలా పిక్స్ గతంలో వైరల్‌ అయ్యాయి. అయితే అదంతా ఓ ఫొటోషూట్‌ కోసం చేసిందని క్లారిటీ ఇచ్చేసింది అమల. ఆ తర్వాత వారిద్దరి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ ఈ జంట వార్తల్లోకి వచ్చేసింది. తనతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో లీక్‌ చేస్తానని చెప్పి భవీందర్‌ తన దగ్గర డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని మీద కేసు పెట్టింది. అమల కేసు టేకప్‌ చేసి భవీందర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.


ఒకానొకప్పుడు సినిమాలను క్విట్‌ చేయాలని అనిపించిందని, తన తండ్రి దూరమయ్యాక ఒంటరిగా నిలబడి, పరిస్థితులకు ఎదురుతిరగడం అలవాటైందని, ఇప్పుడు ఈ కేసు వ్యవహారం కూడా అలా వచ్చిన ధైర్యంతో చేసిందేనని ఫ్రెండ్స్ తో చెప్పుకుందట అమల.

, , , ,