నేను వారం రోజులు షూటింగ్ చేసినా... నేను చేసిన సీన్స్ అన్నీ కథకు అత్యంత కీలకమైనవేనని తెలిసినా... ఎడిటింగ్ లో ఎగిరిపోతాయేమోననే శంక వెంటాడుతూ ఉండేది.  ట్రైలర్ లో మెరిసినప్పుడు తెగ మురిసిపోయినా... నా అదృష్టం మీద నాకు అనుమానం కలుగుతూనే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా చూసినవాళ్లు పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను" అంటున్నారు లాయర్ టర్నడ్ లీడింగ్ యాక్ట్రెస్ జయశ్రీ రాచకొండ. 
 హిందీలోనూ అసాధారణ విజయం సాధించిన "కార్తికేయ -2"లోనూ నటించి మెప్పించిన జయశ్రీ... అక్షయ్ కుమార్ తాజా చిత్రం "రామ్ సేతు"లో జడ్జిగా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. 

అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలగానే ఉందని చెబుతున్న రాచకొండ… ఈ చిత్రం ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు. జయశ్రీ నటిస్తున్న “లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది… చెప్పాలనున్నది, బ్రేకింగ్ న్యూస్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్సకత్వం వహిస్తున్న డాక్టర్ రెహానా” తదితర చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. పలు యాడ్ ఫిల్మ్స్ లోనూ నటిస్తూ ముందుకు సాగుతున్నారు క్రమశిక్షణకు, సమయపాలనకు మారు పేరైన జయశ్రీ రాచకొండ!!

, , , , , , ,