ఏ మాటల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకూ మనిషి మోసపోతూనే ఉంటాడు అంటాడో కమ్యూనిస్ట్ నేత. నిజమే.. ప్రతి మాటకూ ఆ మాట వాడిన వారి ప్రయోజనమో సొంత ఎజెండానో ఉంటాయి. అలాగని అందరూ స్వార్థంగానే ఉంటారు అని చెప్పలేం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్‌ లో ఉన్నవారికి ఇవి ప్రతిసారీ ప్రతికూలంగానే ఉంటాయి. అలా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ గొడవను పొలిటికల్ రూట్ నుంచి పర్సనల్ లైఫ్‌ లోకి టర్న్ అయ్యేలా మారింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు మీదుగా 1986లోనే విజయవాడలో హెల్త్ యూనివర్శిటీ స్థాపించారు. ఈ యూనివర్శిటీకి అనుబంధంగా ఎన్నో కాలేజ్ లున్నాయి. అయితే తాజాగా ఆ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అసెంబ్లీలోనే తీర్మానం చేయించాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోమన్ రెడ్డి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా దుమారం రేగుతోంది.ఇక సినిమా వేదికలపై మా తాత మా తాత అంటూ గ్రాండ్ గా చెప్పుకునే నందమూరి హీరోల రెస్పాన్స్ పై చాలామంది ఆసక్తిగా చూశారు.

ముఖ్యంగా పెద్దాయన పోలికలను పుణికిపుచ్చుకున్న చిన్న ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడా అనుకుంటే ఆయనేమో కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. గతంలో కూడా చంద్రబాబు భార్య భువనేశ్వరి విషయంలోనూ ఇలాగే రియాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్. అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. మరోవైపు రీసెంట్ గా ఆయన బిజెపి నేత అమిత్ షా ను కలవడంతో పాటు మొదట్నుంచీ వైఎస్ఆర్ సిపీకి దగ్గరగా ఉంటున్నాడు అనే విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. ఇక ఏకంగా ఎన్టీఆర్ పేరు మార్పు పై కూడా ఏదో తూతూ మంత్రంగా స్పందించాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు మండిపడుతున్నారు.అతను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి వారసుడు కాలేడు.

లక్షలమంది కార్యకర్తలకు అండగా(ఇన్ డైరెక్ట్ గా లోకేష్‌ ను ఉటంకిస్తూ) ఉండేవాడే టిడిపికి సరైన వారసుడు అంటూ పనిలో పనిగా స్పందిస్తున్నారు కూడా. మరికొందరైతే ఏకంగా “వైఎస్ ఎన్టీఆర్” లా ఉందీ ఈ స్పందన అంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా టిడిపి సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ పై ఓ రేంజ్ లో మండి పడుతున్నారు. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ట్వీట్ ను జీర్ణించుకోలేక అటు సొంత పార్టీ వారికే కౌంటర్ ఇవ్వలేక మల్లగుల్లాలు పడుతున్నారు.ఇదే అంశంపై కళ్యాణ్‌ రామ్ కూడా స్పందించాడు. అదీ ఇంచుమించు అలానే ఉంది. కానీ కాస్త స్క్రిప్ట్ లెంగ్త్ పెరిగింది. దీంతో ఆయన పెద్దగా దొరకలేదు. ఏదేమైనా ఎన్టీఆర్ ట్వీట్ ను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీకి రాబోయే వారసుడిని కూడా నిర్ణయించేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపైనా ఎన్టీఆర్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

, , , , , , , , ,