ad

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు అనే మాట చాలు .. బాక్స్ ఆఫీస్ హీటెక్కడానికి. విచిత్రంగా అలా జరగడం లేదు. పైగా చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బెస్ట్ అప్లాజ్ అందుకున్నాడు. నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది . అయినా ఆచార్య కు అస్సలు బజ్ రావడం లేదు. ట్రైలర్ కు ముందు వరకు ఓకే కానీ .. ట్రైలర్ తర్వాత అందరి ఇంట్రెస్ట్ పోయింది. అటు ఫాన్స్ లో కూడా ఈ మూవీ పై నమ్మకం లేదు అంటున్నారు.తండ్రి కొడుకు కలిసి నటించినా అస్సలు బజ్ రామపోవడంతో మెగా టీమ్ సైతం ఆశ్చర్యంగా ఉందట. అందుకే ఆచార్య ను లేపేందుకు రకరకాల జాకీలు వేస్తున్నారు. అందులో ఒక జాకీ మహేష్ బాబు.
మామూలుగా చిన్న హీరోలు, చిన్న సినిమాలు పెద్ద హీరోల గొంతులు అరువు తీసుకుంటారు. లేదూ ఆయా హీరోలు, దర్శకుల మధ్య ఉండే అండర్స్టాండింగ్ ను బట్టి వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇక్కడా ఆ బాండ్ ఉంది. బట్ ఒక మెగాస్టార్ .. ఒక మెగా పవర్ స్టార్ ఉన్న కూడా సూపర్ స్టార్ తో వాయిస్ ఓవర్ చేయించడం చూస్తోంటే .. ఆచార్య కు ఎన్ని కష్టాలు వచ్చాయి అనేది అర్థం కావడం లేదూ.
ఏదేమైనా ఈ మూవీ కి అస్సలు క్రేజ్ లేదు అనేది నిజం. బ్రాండెడ్ బట్టల్లో నక్సలైట్ గెటప్ లు వేసిన ప్పుడే విమర్శలు వచ్చాయి. దానికి దేవాలయాలు, ధర్మస్థల అంటూ సంబంధం లేని సబ్జెక్టు ఆడ్ చేశారు. దీనికి తోడు ట్రైలర్, పాటలు అస్సలు బాలేదు .. వెరసి ఆచార్యకు ఆశించినంత హైప్ రావడం లేదు.. అందుకే ఇన్ని ఆరాటాలు అనుకోవచ్చు.

, , , , , , , , ,