Advertisement
సినిమా ఆఫర్ సంపాదించిన కృతిశెట్టి
Latest Movies Tollywood

సినిమా ఆఫర్ సంపాదించిన కృతిశెట్టి

Advertisement

ప్రతి దర్శకుడికీ ఓ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఆడియన్సెస్ కు కనెక్ట్ చేయగలిగితే వాళ్లు సదరు దర్శకులను అభిమానిస్తారు. అలా మొదటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన సినిమాల్లో ఎక్కువగా పొయొటిక్ సెన్స్ కనిపిస్తుంది. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాడు. ఎప్పుడైనా వాస్తవ దూరంగా వెళితే అతనికి ‘వి’జయమూ దూరమవుతుంది. మొత్తంగా వి ఫ్లాప్ తర్వాత ఇప్పుడు సుధీర్ బాబుతోనే మూడో సినిమాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నాడు. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా టీజర్ విడుదల చేశారు.

కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ లో కొత్తదనం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. కృతిశెట్టి ఇంతకు ముందు చేసిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని పాత్రకు ఇది ఎక్స్ టెన్షన్ లా కనిపించే తప్ప అస్సలు ఫ్రెష్ నెస్ లేదు. శ్యామ్ సింగరాయ్ లో తనకు ఇష్టం లేకపోయినా.. షార్ట్ ఫిల్మ్ లో నటించాల్సి వచ్చి నటిస్తుంది. ఈ మూవీ టీజర్ లోనూ అదే కనిపించింది.. తనకు ఇష్టం లేకపోయినా డాక్టర్ ప్రొఫెషన్ లో ఉంటూ ‘సినిమాలో హీరోయిన్ ’గా నటించేందుకు బలవంతంగా ఒప్పించబడుతుంది. ఓ రకంగా షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా ఆఫర్ సంపాదించినట్టుగా కనిపించింది.
ఇక సుధీర్ బాబు ఈ మూవీలో ఫిల్మ్ డైరెక్టర్ గా కనిపిస్తున్నాడు. వరుస విజయాలతో ఉణ్న అతని మనసుకు దగ్గరగా ఉన్న కథను చెప్పడానికి కృతిశెట్టి మాత్రమే సరైన ఫేస్ అనిపిస్తుంది. అందుకే తనను బలవంతంగా తన సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పిస్తాడు. మరి ఈ కథలో ఆ అమ్మాయి గురించి చెప్పేంత స్కోప్ ఏం ఉందో సినిమా చూస్తే కానీ తెలియదు. బట్.. టీజర్ అయితే అనుకున్నంతగా ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి.

Advertisement