సౌత్ లో ఎవరెన్ని చెప్పినా పెద్ద మార్కెట్ అంటే తెలుగే. మన తర్వాతే తమిళ్ సినిమా అనేది ఈ దశాబ్ధం నిరూపించింది. అఫ్ కోర్స్ అంతకు ముందు వారిదే ఈ సీట్. ఈ దశాబ్ధంలోనే ప్యాన్ ఇండియన్ మార్కెట్ అంటూ పాత మాట కొత్తగా వచ్చింది. మార్కెట్ పెరిగింది అందుకు తగ్గట్టుగానే బడ్జెట్. భారీ కాన్వాస్ తో పాటు మంచి కథలుంటే లాంగ్వేజ్ బారికేడ్స్ కూడా తెంచుకుని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇందుకు నాందిగా నిలిచింది తెలుగు సినిమా. అందుకే ఇప్పుడు ఇతర భాషల హీరోలు మన మార్కెట్ పై కన్నేశారు. ఆ విషయం డబ్బింగ్ రూపంలో కాకుండా దానికే స్ట్రెయిట్ మూవీ అనే కలరింగ్ ఇస్తూ ఇక్కడి నిర్మాణ సంస్థ, ఇక్కడి దర్శకులతోనే సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లిస్ట్ లో ముందుగా కనిపిస్తోంది కోలీవుడ్. ఇప్పటికే విజయ్, ధనుష్‌, శివకార్తికేయన్ ఈ ఫార్మాట్ లోకి వచ్చేసి తెలుగు సినిమాలో తమ జెండా పాతేయాలని చూస్తున్నారు. అయితే వీరిలో ధనుష్‌ ఇంకాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్నాడు.
ధనుష్‌ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సార్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అతని సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు శేఖర్ కమ్ముల సినిమా కూడా లైన్ లో ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్సేం పెద్దగా కనిపించడం లేదు ఈ మధ్య. ఈ టైమ్ లో ధనుష్‌ను మైత్రీ మూవీస్ మేకర్స్ సంప్రదించింది. మంచి కథ ఉంటే చేస్తానని చెప్పాడు. అంతే కాదు.. ఇతర పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ కు కూడా ధనుష్‌ టీమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్లిందట. బలమైన కథలుంటే ధనుష్‌ రెడీ అని. ముఖ్యంగా తెలుగులోనే ఎక్కువ ఫోకస్ చేశాడంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే మైత్రీ మూవీస్ మేకర్స్ వంటి పెద్ద కంపెనీలు కథలు వినే పనిలో పడ్డాయిట. అంటే మన హీరోల్లాగా కాంబోస్ సెట్ అయితే కాల్షీట్స్ ఇచ్చే రకం కాదు కదా ధనుష్. ప్రాపర్ స్టోరీతో పాటు బౌండ్ స్క్రీప్ట్ ఉంటే తప్ప కమిట్ కాడు. అందుకే అతనికి ప్యాన్ ఇండియన్ నుంచి హాలీవుడ్ వరకూ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను క్యాష్‌ చేసుకోవాలంటే మనోళ్లూ మంచి కథలనే ఎంచుకోవాలి కదా..? ఏదేమైనా ధనుష్ ఇలా సడెన్ గా తెలుగును టార్గెట్ చేయడం వెనక ఇంకేదైనా ప్లాన్ ఉందంటారా..?

, , , , , , , ,