ఒక సినిమా మేకింగ్ లో ఉన్నప్పుడే ఆ దర్శకుడి కెపాసిటీ ఏంటో సీనియర్ హీరోలకు తెలిసిపోతుంది. దీంతో తాము మేకింగ్ లో ఇన్వాల్వ్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఆ డెసిషన్ ను బట్టే డైరెక్టర్ రేంజ్ తేలిపోతుంది. అలా మాస్ మహరాజ్ చేస్తోన్న ఓ సినిమా దర్శకుడు అతనికి బాగా నచ్చాడట. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే అతనికి మరో ఆఫర్ ఇచ్చాడు. రిలీజ్ తర్వాత రిజల్ట్ కూడా చూడకుండానే రెండో సారి పనిచేయానికి ఛాన్స్ ఇచ్చాడంటే ఆ దర్శకుడు రవితేజకు ఎంత నచ్చి ఉండాలి..? అది సరే ఇంతకీ ఆ దర్శకుడు ఎవరనే కదా మీ డౌట్..

మాస్ మహరాజ్ కు తన దర్శకులు బాగా నచ్చడం అరుదుగా జరుగుతుంది. అలా నచ్చితే వారితో జర్నీ చేయడానికి ఎక్కువగా ఆలోచించడు. ఒకప్పుడు పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి వారు ఈ లిస్ట్ లో ఉండేవారు. ఈ ఇద్దరూ అతని కెపాసిటీని ఎలివేట్ చేశారు. అతని ఇమేజ్ ను హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నారు. ఆ తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ రవితేజకు కంటిన్యూస్ గా తిగిలాడు అని చెప్పలేం. మరి ఇంకా సినిమా కూడా విడుదల కాకుండానే ఇప్పుడు ఓ దర్శకుడికి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. ఆ దర్శకుడు సుధీర్ వర్మ. స్వామిరారాతో ఆకట్టుకున్న అతను తర్వాత ఆ స్థాయి హిట్ చూడలేదు. బట్ ఓ మేకర్ గా సుధీర్ వర్మ వర్క్ కు ప్రతిసారి ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతారు. ముఖ్యంగా టెక్నికల్ బ్రిలియన్సీ కనిపిస్తుంది అతని సినిమాల్లో. సుధీర్ వర్మ – రవితేజ కాంబినేషన్ లో రావణాసుర అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మేఘా ఆకాశ్, అనూ ఇమ్మానుయేల్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ ఫీమేల్ లీడ్స్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రావణాసుర సినిమా చిత్రీకరణ చివరికి వచ్చేసింది. ఈ యేడాదే విడుదలవుతుంది. ఈ మూవీ చేస్తోన్న టైమ్ లోనే సుధీర్ వర్మకు మరో ఆఫర్ ఇచ్చాడు రవితేజ. అతనూ ఆ ఛాన్స్ ను వాడుకుని ఓ కథ చెప్పాడట. అదీ మాస్ రాజాకు నచ్చింది. ఇంప్రెస్ అయ్యాడు. కట్ చేస్తే ఈ కాంబోలోనే మరో సినిమా వచ్చే యేడాది ప్రారంభం అవుతుందంటున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నాడు. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారట. మాస్ రాజా చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి. రీసెంట్ గా కార్తీక్ ఘట్టమనేనితో ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడు. ఇది మరోటి. ఏదేమైనా మాస్ రాజా దూకుడు మామూలుగా లేదు.

, , , , , , ,