రెండు దశాబ్ధాల క్రితం తెరంగేట్రం చేసిన బ్యూటీ త్రిషకు ఇంకా గుడ్ టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు సౌత్ మొత్తం టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. కొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఓ దశలో వెనకబడిపోయింది. అయినా నయనతారను ఆదర్శంగా తీసుకుని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ట్రై చేసింది. బట్ నయన్ లా తను క్లిక్ కాలేకపోయింది. మధ్యలో రానాతో లవ్ ఎఫైర్ విషయంలోనూ లైమ్ లైట్ లో కనిపించిన ఈ చెన్న బ్యూటీ ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది అనుకునే టైమ్ లోనే అనూహ్యంగా 96 అనే మూవీ బూస్టప్ ఇచ్చింది.

ఈ మూవీలో తన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. కేవలం రెండు మూడు కాస్ట్యూమ్స్ తోనే సినిమా అంతా కనిపించి.. అటు విజయ్ సేతుపతిని కూడా డామినేట్ చేసింది తన నటనతో. 96 లో జానుగా ఆ పాత్రకు ప్రాణం పోసిన అమ్మడిని మణిరత్నం తన పొన్నియన్ సెల్వన్ లో ఓ కీలక పాత్రకు తీసుకున్నాడు. ఈ మూవీలోనూ తనదైన స్టైల్లో మ్యాజిక్ చేసింది. అయితే ఇలాంటి పాత్రల కంటే ఇంకా రెగ్యులర్ హీరోయిన్ టైప్ రోల్స్ ఉంటేనే ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కూడా మళ్లీ రిపీట్ కాబోతోంది త్రిషకు.
2003ay తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఒక్కడు చిత్రాన్ని 2004లో గిల్లీగా రీమేక్ చేశాడు విజయ్. ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది త్రిష.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జోడీ వెండితెరపై కనువిందు చేయబోతోంది. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా18యేళ్ల తర్వాత ఓ జంట మళ్లీ కలిసి నటిస్తోందంటే కాస్త ఆశ్చర్యమే. పైగా ఇద్దరికీ మంచి క్రేజ్ ఉంది. త్రిషకు తెలుగులో విజయ్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రస్తుతం సినీవర్స్ అనే కొత్త ప్రపంచాన్ని ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన లోకేష్‌ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలోనే విజయ్ సరసన త్రిషను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు దర్శకుడు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ మూవీ త్రిషకు మరింత ఎక్కువ కెరీర్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా ఈ డస్కీ బ్యూటీకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

, , , , , , , , , , ,