నన్ను నటిగా భరించాల్సిందే అంటున్నారు యాంకర్ సుమ. ఆమె నటిస్తున్న సినిమా “జయమ్మ పంచాయతీ” టీజర్ ను హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా
సుమ మాట్లాడుతూ… ‘మీరు ఈ పాత్రను చేయగలను అని అనుకుంటున్నారా? అని దర్శకుడు అన్నారు. ఆ మాటతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. టీం మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిందే. నేను ఈ సినిమా కోసం ఆ యాసను నేర్చుకున్నాను. కీరవాణి గారు ఒక్క ఫోన్ కాల్తో ఈ సినిమాకు ఓకే చెప్పారు. కథ విన్న తరువాత ఆయనకు ఎంతో నచ్చింది. ఒక బాహుబలి.. ఒక ఆర్ఆర్ఆర్.. ఒక జయమ్మ పంచాయతీ. సుమ సినిమా చేస్తోందని నా కోసం చేశారు. ఆయనకు థ్యాంక్స్. మా డీఓపీ అనుష్ కుమార్కు ఇది మొదటి సినిమా. ఈ సినిమా కోసం 18 రోజులు అనుకుంటే 40 రోజులు పని చేశాను. అక్కడి లోకేషన్లను అద్భుతంగా చూపించారు. ఇందులో జయమ్మ కథే కాదు. చాలా కథలున్నాయి. వాటితో జయమ్మ సమస్యలు ఎలా కనెక్ట్ అయి ఉంటాయనేది కథ. అని అన్నారు.