ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్..ఈ నెల 30తో తేలిపోతుంది

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తుందా..? గత కొన్నాళ్లుగా ఈ ప్రశ్న అందరి నుంచీ వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ప్లేస్ లో ఓ గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్ కు నామినేట్ చేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ గుస్సా అయ్యారు. అయినా రాజమౌళి చిత్రానికి ఆస్కార్ వచ్చే ఆస్కారం ఇంకా ఉందని చెప్పుకున్నారు. మరి నిజంగా ఆస్కారం ఉంటుందా లేదా అనేది ఈ నెల 30న తేలిపోతుంది. అదెలా అంటారా..? ఆ రోజే ఆస్కార్ అకాడెమీ టీమ్ ఈ చిత్రాన్ని చూడబోతోంది. వాళ్లు చూసి ఏ కేటగిరీలో నామినేట్ చేయొచ్చో డిసైడ్ చేస్తారన్నమాట. మరి ఏ కేటగిరీస్ లో ఆస్కార్ కు అవకాశం ఉందో తెలుసా..?ఆస్కార్ నామినేషన్స్ లో అన్ని దేశాల నుంచి కనిపించే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీకి గుజరాతీ చిత్రం సెలెక్ట్ అయింది. కాబట్టి ఆ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు చోటు లేదు.

బట్.. మరికొన్ని కేటగిరీస్ లో నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లిస్ట్ లో కూడా ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి. ప్రధానంగా బెస్ట్ యాక్టర్ లేదా సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ .. ఇలా మరికొన్ని కేటగిరీస్ లో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే వీటిలో ఏ కేటగిరీలో నామినేట్ చేయొచ్చు అనేది ఈ నెల 30న అకాడమీ మెంబర్స్ చూసిన తర్వాత డిసైడ్ చేస్తారన్నమాట.

ఆర్ఆర్ఆర్ నామినేట్ అయినంత మాత్రాన అవార్డ్ గెలుచుకున్నట్టు కాదు. కేవలం నామినేట్ అవుతుంది. అదే కేటిగిటీలో ఇతర దేశాల నుంచి వచ్చే సినిమాలను ఢీ కొట్టి వాటికంటే బెస్ట్ అనిపించుకుంటేనే ఇప్పుడు ఆస్కార్ కు ఆస్కారం ఉంటుంది. సో.. ఈ ప్రాసెస్ అంతా ఓ లెక్క ప్రకారం జరుగుతుంది. అలాగే అసలు ఏ కేటగిరీలోనూ నామినేట్ కాకపోయినా ఆశ్చర్యం లేదు. బట్ ఈ మూవీకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా ఓటిటిల్లో చూసిన వాల్డ్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ ను ఆకాశానికెత్తారు. సో.. అకాడెమీకి కూడా ఓ ఒత్తిడి ఉంటుంది. సో.. ఏదో కేటగిరీలో పోటీలో ఉంటుందని చెప్పొచ్చు.

Related Posts