Big Story Box Office Breaking News Latest News Movies

వరల్డ్ ఫేమస్‌ లవర్‌ రివ్యూ & రేటింగ్‌

రీసెంట్‌గా సరైన సక్సెస్‌ లేని టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషనల్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ… వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నమే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌…

నలుగురు హీరోయిన్‌లతో గ్రాండ్‌గా భిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టయినర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్‌ బిగ్‌ మైనస్‌గా మారాడని చెప్పవచ్చు.. ఫస్ట్‌ హాఫ్‌ ఎంత బావుందో.. విజువల్‌గా, ఇటు నారేషన్‌ పరంగా అద్భుతంగా ఆడియెన్స్‌కి ఆకట్టుకున్న ఈ చిత్రం.. సెకండాఫ్‌ అంతకు రెండింతలు నెగిటివ్‌గా మారింది..

తొలి అర్ధ భాగంలో దర్శకుడు ట్రీట్‌మెంట్ పరంగా కొత్త పుంతలు తొక్కించాడు.. కానీ, సెకండాఫ్‌లో మాత్రం అదే టెంపోని, మూడ్‌ని కొనసాగించడంలో క్రాంతి మాధవ్‌ తడబడ్డాడని చెప్పొచ్చు..

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందంతో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడంలో దర్శకుడు క్రాంతి మాధవ్‌, నిర్మాత కేఎస్‌ రామారావు ఫెయిలయ్యారని క్రిటిక్స్‌ నుండి వినిపిస్తోన్న మాట.. ఇక, నటుడిగా విజయ్‌ మరోసారి అల్టిమేట్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.. అయితే, నలుగురు హీరోయిన్‌లలో ఐజబెల్లి పాత్ర, ఆమెతో హీరో లవ్‌ ట్రాక్‌ చాలా డల్‌గా సాగింది.. మూవీకి ఇదే అది బిగ్గెస్ట్‌ మైనస్‌..

టైటిల్‌ రోల్‌ విజయ్‌ పోషించినా, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా ఆకట్టుకున్నది మాత్రం హీరోయిన్‌లు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌.. వీరి పాత్రల కేరక్టరైజేషన్‌ బావుంది.. నటనలోనూ మెప్పించారు. ఇక, మరో గ్లామరస్‌ బ్యూటీ, లవ్‌లీ ఏంజెల్‌ కేథరిన్‌ అందాల ఆరబోతకే పరిమితం అయింది.

మొత్తమ్మీద, కెరీర్‌ని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించాలనుకుంటున్న విజయ్‌ దేవరకొండకి ఇది బిగ్గెస్ట్‌ మైనస్‌…. ఆయన ఆశలపై క్రాంతి మాధవ్‌ నీళ్లు చల్లాడు… విజయ్‌ ఇకపై కొత్త సినిమాలలో అయినా కథకి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆయన స్టార్‌డమ్‌ మరింత డ్రాప్‌ అవడం ఖాయం..

బాటమ్‌ లైన్‌…. ప్రేమికుల రోజు… విజయ్‌కి వరల్డ్‌ ఫేమస్‌ డిజప్పాయింట్‌మెంట్‌..!!

రేటింగ్‌…. 2.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *