Box Office Breaking News Latest News Movies

ప్రభాస్ కోసం మళ్లీ విలన్ ఏంటీ..?

డార్లింగ్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది. సాహో  రిజల్ట్ తర్వాత కథలో అనేక మార్పులకు గురైంది. దీంతో అనుకున్న టైమ్ లో ప్రారంభం కాలేదు. ఫైనల్ గా గత డిసెంబర్ లో ప్రారంభం అయిన ఈ సినిమాకు ఆది నుంచి అవాంతరాలే వస్తున్నాయి. అయితే ఈ సారి అలా కాకుండా చాలా వేగంగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ లేటెస్ట్ గా మరో న్యూస్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో విలన్లూ, ఫైట్లు, యాక్షన్ సీన్లూ ఉండవని ముందు నుంచీ వినిపిస్తోంది. అయితే అవన్నీ నిజం కాదని తేలిపోయింది.

తాజాగా ఈ చిత్రంలోకి జగపతిబాబు జాయిన్ అవుతున్నాడు. యస్.. అతను విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఆల్రెడీ ఒకప్పటి ప్రేమపావురం.. భాగ్యశ్రీ సినిమాలో ప్రభాస్ కు లేదా హీరోయిన్ పూజాహెగ్డేకు మదర్ గా నటిస్తోంది. ఇప్పుడు జగ్గూ కూడా చేరాడంటే ఆ ఇద్దరూ పెయిరా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే సినిమా చివరి దశకు వచ్చిందనుకుంటోన్న టైమ్ లో ఇప్పుడు జగపతి లాంటి టాప్ స్టార్ ను తీసుకున్నారంటే అది కూడా విలన్ పాత్రలో అంటే .. కొత్త డౌట్స్ వస్తున్నాయి. అంటే మొదట్లో ఇది ప్యూర్ లవ్ స్టోరీ అన్నారు కదా. దీన్ని బట్టి కాదేమో అనిపిస్తోందనే కదా అర్థం.

మొత్తంగా సాహో రిజల్ట్ తర్వాత చేసిన మార్పులు ఇవే అన్నమాట. సో.. జాన్ అనే టైటిల్ నుంచి ‘ఓ డియర్’ అనే వర్కింగ్ టైటిల్ కు మారిన ఈ చిత్రంలో కూడా యాక్షన్ కు స్కోప్ ఉండబోతోందన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *