Box Office Breaking News Latest News Movies

విజయ్ ని కరుణించని ‘సాయి’

విజయ్ దేవరకొండ.. కొన్ని రోజుల క్రితం వరకూ మనోడి హడావిడీ చూసి టాప్ స్టార్ రేస్ లోకి వస్తాడు అనుకున్నారు. కానీ ఓ రేంజ్ లో ఎగిరిన ఈ స్టార్ హ్యాట్రిక్ ఫ్లాపుతో ఒక్కసారిగా డీలా అయిపోయాడు. హ్యాట్రిక్ ఏంటీ అనుకుంటున్నారా.. లేటెస్ట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కు వచ్చిన టాక్ కూడా అదే కదా. గతంలో నోటా, డియర్ కామ్రేడ్ తో ఫ్లాపులు చూసిన విజయ్ ని ఈ ఫేమస్ లవర్ సైతం ఆదుకోలేకపోయాడు. కథ, బానే అనిపించినా కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసిన ఈ సినిమాలో కేవలం ఒక ప్రేమకథ మాత్రమే ఆకట్టుకునేలా రూపొందించగలిగాడు దర్శకుడ క్రాంతిమాధవ్. దీంతో ఈ మూవీతో విజయ్ దేవరకొండకు షాక్ తప్పలేదు.
విశేషం ఏంటంటే.. రెండు ఫ్లాపులు వచ్చిన తర్వాత విజయ్ కూడా సెంటిమెంట్ కు తలొంచాడు. మొన్నటి వరకూ విజయ్ దేవరకొండ అని పేరు వేసుకున్న అతను.. వరల్డ్ ఫేమస్ లవర్ లో మాత్రం ‘‘దేవరకొండ విజయ్ సాయి’’అని వేసుకున్నాడు.

బట్.. పేరు మారినా తీరు మారలేదు అనేలా ఉందీ మూవీ రిజల్ట్. నలుగురు హీరోయిన్లు, మూడు ప్రేమకథలు.. ఒకటి ఒరిజినల్, రెండు ఫిక్షనల్ స్టోరీస్ గా వచ్చిన ఈ లవర్ తీరు పెద్దగా మారలేదనే చెప్పాలి. ఇల్లందు ఎపిసోడ్ వరకూ మెస్మరైజ్ చేసినా.. ఆ మెరుపులు మరింత టైమ్ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. మొత్తంగా విజయ్ సాయి దేవరకొండ ఇక పూరీపైనే భారం వేయాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *