Big Story Box Office Breaking News Latest News Movies

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రివ్యూ

తారాగణం : విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేశ్, రాశిఖన్నా, కేథరీన్, ఇజబెల్లా..
సంగీతం : గోపీసుందర్
సినిమాటోగ్రఫీ : జయకృష్ణ గుమ్మడి
నిర్మాత : కెఎస్ రామారావు
దర్శకత్వం : క్రాంతి మాధవ్

విజయ్ దేవరకొండ స్టామినా గురించి క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కరలేదు. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ కు అడ్వాన్స్ బుకింగ్ ఆ రేంజ్ లో ఉంది. నిజానికి ఈ మూవీ విడుదలకు ముందు అనుకున్నంత బజ్ రాలేదు. కానీ బుకింగ్స్ లో మాత్రం అతని క్రేజ్ కనిపించింది. దీంతో సినిమాలో కంటెంట్ ఉన్నట్టే అని చాలామంది అనుకున్నారు. మరి ఆ కంటెంట్ నిజంగా ఉందా లేదా అనేది ఈ ప్రీ రివ్యూలో చూద్దాం.

వరల్డ్ ఫేమస్ లవర్ ను రెగ్యులర్ రివ్యూస్ లా కాకుండా చూడాలి. ఎందుకంటే.. ఇది అలా చెప్పేందుకు ఆస్కారం లేని సినిమా. ఒకవేళ చెబితే సినిమాకు ప్రధానమైన పాయింట్ రివ్యూ అవుతుంది. అందుకే ఈ నాలుగు కథల సమాహారాన్ని అలా ఒక్కో పార్ట్ గానే చూడాలి. ట్రైలర్ లోనే చెప్పినట్టుగా ఇది భిన్నమైన నేపథ్యాల్లో సాగే ప్రేమకథ(లు). అయితే మగ వ్యక్తి ఒక్కడే. మరి అతనికి అదెలా సాధ్యమైందీ అనేదే అద్భుతమైన పాయింట్ తో రాసుకున్నాడు క్రాంతి మాధవ్. ఓ రకంగా చెబితే ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదనే చెప్పాలి. మనిషి మస్తిష్కంలో నుంచి పుట్టిన ఆలోచనల సంఘర్షణగా మొదలైన కథ(లు).. ఒక్కో కథతో ఒక్కో అనుభూతిని నింపాడు దర్శకుడు. అందుకు అతనికి ఆర్టిస్టుల నుంచి అద్భుతమైన సహకారం కూడా వచ్చింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఒన్ మేన్ షో ఇది.
ముందుగా పైలట్ తో మొదలైన ప్రేమకథ.. ఆ తర్వాత మరో కథలోకి ఎలా ఎంటర్ అయింది అనేదే ఈ సినిమాకు అత్యంత కీలకమైన పాయింట్. ఇలాగే ప్రతి కథకూ ఓ కీ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ విషయంలో ప్రేక్షకుడి నాలెడ్జ్ కు ఓ రకమైన టెస్ట్ పెట్టాడు దర్శకుడు. ఆ టెస్ట్ లో అతను పాస్ అయితే.. ప్రేక్షకుడికి ఓ అత్యద్భుతమైన సినిమా చూశాం అన్న భావన కలుగుతుంది. ఒకవేళ టెస్ట్ పాస్ కాకపోయినా.. ఒక్కో కథకు ఒక్కో రకమైన అనుభూతిని పొందుతాడు.
అయితే ఈ నాలుగు కథల్లో ది బెస్ట్ ఏదంటే మాత్రం ఖచ్చితంగా రాశిఖన్నాదే అని చెప్పాలి. తను ముందు నుంచీ చెబుతున్నట్టుగా తన పాత్ర నిజంగానే ఓ సర్ ప్రైజ్. కొన్నాళ్ల పాటు వెంటాడే పాత్ర. ఐశ్వర్య రాజేశ్ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ట్రాన్స్ ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు ఐశ్వర్య కూడా అదరగొట్టింది.  అలాగే ఒక్కో కథ ఒక్కో టేస్ట్ ఉన్న ప్రేక్షకుడిని నచ్చుతుంది. అలాగే మిగతా కథలు సైతం మెస్మరైజ్ చేస్తాయి.

ఇది దర్శకుడు క్రాంతిమాధవ్ సినిమా. అతని రైటింగ్ టాలెంట్ ఎంత బ్రిలియంట్ అనేది తేల్చిన సినిమా. ఇందుకు జయకృష్ణ గుమ్మడి బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిస్తే.. ఏదో హైలెట్ కావాలని కాకుండా కథలకు అనుగుణంగా వచ్చే గోపీసుందర్ పాటలు మెస్మరైజ్ చేస్తాయి. వాటి పిక్చరైజేషన్ సైతం వావ్ అనిపిస్తుంది.

మొత్తంగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కెఎస్ రామారావు నుంచి మరో బ్యూటీఫుల్ మూవీ వచ్చిందనే చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ క్రేజ్ యాడ్ అయిన తర్వాత ఈ సినిమా ఏ రేంజ్ కు వెళుతుందనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *