Box Office Breaking News Latest News Movies

తెలుగు దర్శకురాలితో విజయ్.. ?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు.. అంటే మొన్నటి వరకూ రజినీకాంత్ పేరు చెప్పుకున్నాం. కానీ కొన్నాళ్ల క్రితమే ఆ పేరుకు ముందు ఇళయదళపతి విజయ్ పేరు వచ్చేసింది. కాన్ స్టంట్ గా హిట్స్ కొడుతూ ప్రతి సినిమాతో వంద కోట్లకు పైగా కొల్లగొడుతూ అతను బాక్సాఫీస్ బాద్ షాగా మారాడు. అలాంటి విజయ్ కి కథ చెప్పి ఒప్పించడం అంటే అంత సులువు కాదు. ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ లో సినిమా విడుదలవుతుంది. ఇక ఇదే టైమ్ లో అతని నెక్ట్స్ సినిమాల రేస్ లో ఓ తెలుగు దర్శకురాలి పేరు కూడా వినిపిస్తోంది. తను రీసెంట్ గా విజయ్ కి కథ చెప్పగానే నచ్చడం.. ఒప్పేసుకోవడం అయిపోయాయి అంటున్నారు. ఇంతకీ తనెవరనుకుంటున్నారు.. ? సుధా కొంగర.

2010లో ద్రోహి అనే తమిళ్ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయినా.. ఆరేళ్ల తర్వాత చేసిన ఇరుదు సూట్రూ(హిందీలో సాలా ఖడూస్)తో ఫేమ్ అయింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా గురు పేరుతో తనే రీమేక్ చేసింది. ప్రస్తుతం తమిళ్ స్టార్ సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. ఆ తర్వాత తను విజయ్ తోనే సినిమా చేయబోతోందట. మొత్తంగా విజయ్ ఎంచుకునే కథల్లో ఈ మధ్య చాలా మెచ్యూరిటీ ఉంటోంది. అందుకే తను ఓ మహిళా దర్శకురాలికి అవకాశం ఇవ్వడంలో ఆశ్చర్యమేం లేదు. మొత్తంగా వైజాగ్ కు చెందిన సుధా కొంగర ఈ ఛాన్స్ తో అక్కడ విజయం సాధిస్తే ఖచ్చితంగా టాప్ హీరోలందరికీ సులువుగా కథలు చెప్పే ఛాన్స్ కూడా కొట్టేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *