Big Story Box Office Breaking News Latest News Movies

బాహుబలిని టార్గెట్ చేసిన రాజమౌళి

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ కొట్టలేని రికార్డులు కొల్లగొట్టిన సినిమా. ఓ ప్రాంతీయ సినిమాగా మొదలై ఇండియన్ సినిమాకే ఎడ్రెస్ లా మార్చాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ తో కొన్ని రికార్డులు, సెకండ్ పార్ట్ తో అన్ని రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ తో రాజమౌళి ఏకంగా తన రికార్డులనే టార్గెట్ చేశాడు.

బాహుబలి -2 వాల్డ్ వైడ్ గా 1800కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ మూవీతో ఆ రికార్డును కొల్లగొట్టాలనుకుంటున్నాడు రాజమౌళి. అయితే బాహుబలి ఫిక్షన్ మూవీ. ఇది కాస్త హిస్టారికల్ కాస్త ఫిక్షన్. ఇక్కడి పాత్రలు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. బాహుబలిలో ఊహకు అంతులేని పాత్రలు. మరి ఈ రికార్డ్ సాధించడం.. మరోసారి బాహుబలిలా అన్ని వర్గాల, రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యమా అనేది పక్కన బెడితే రాజమౌళి మాత్రం తన రికార్డులే టార్గెట్ గా బిజినెస్ ను చేస్తున్నాడు. మరి ఆర్ఆర్ఆర్ తో ఆ ఫీట్ సాధించగలిగితే రాజమౌళిని మించిన తోపు లేడనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *