Box Office Breaking News Latest News Movies

ఆ దర్శకుడి తీరు నానికి నచ్చలేదుట

ఓ సినిమాకు ప్రధానంగా అనిపించేది హీరో, దర్శకుడు, నిర్మాత, సినిమాటోగ్రాఫర్.. ఈ నలుగురి మధ్య మంచి అండస్టాండింగ్  ఉంటేనే ఆ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తే మాత్రం ఆ తర్వాత వారి కలయిక అసాధ్యం అవుతుంది. అంటే కాంబినేషన్ రిపీట్ కావడం ఎక్స్ పెక్ట్ చేయలేం. టాలీవుడ్ లో ఇలాంటి ఓ క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్న కాంబినేషన్ గురించే ఇప్పుడు ఓ హాట్ చర్చ నడుస్తోంది. అయితే ఇందులో పూర్తిగా ఆ దర్శకుడిదే తప్పు అంటున్నారు చాలామంది. నిజానికి ఆ దర్శకుడు రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ టైమ్ లో కూడా అనైతికంగా బిహేవ్ చేశాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే ..

నేచురల్ స్టార్ నాని కొన్నాళ్ల క్రితం ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు కదా. కొత్త టాలెంట్ ను కంటెంట్ ను ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ‘అఁ’ వచ్చింది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతోనే దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కేవలం నాని నిర్మాత అయ్యాడు అంటే అది మంచి కంటెంట్ అనే ఉద్దేశ్యంతోనే నటించారు. అయితే ఈ సినిమా టైమ్ లో దర్శకుడు నిర్మాతను అస్సలు లెక్క చేయలేదుట.. కొన్ని విషయాల్లో నాని ఎంత చెప్పినా పట్టించుకోలేదని కూడా వినిపించింది. ఆ కారణంగానే ‘అఁ’ అనుకున్నంతగా సక్సస్ కాలేదు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నారు. కానీ ఈ సారి కూడా దర్శకుడు అదే కేర్ లెస్ గా కథను సిద్ధం చేసుకున్నాడట. అసలే ఆ దర్శకుడిపై నానికి మంచి ఒపీనియన్ పోయింది. దీనికి తోడు ‘అఁ’సినిమాకు బెస్ట్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే ఈ అవార్డ్ కు ఒరిజినల్ గా చేసిన వారి పేరుతో కాకుండా ప్రశాంత్ వర్మ తన ఫ్రెండ్స్ కంపెనీ పేరుతో పంపించాడట. ఇలా చేయొద్దని నాని చెప్పినా వినలేదు. ఫైనల్ గా మీడియాలో తెలిసి మనోడిని అంతా ఓ రేంజ్ లో వేసుకున్నాక.. ఒరిజినల్ వాళ్లను పంపించాడు.

మొత్తంగా ‘అఁ’ తర్వాత కల్కితోనూ పెద్దగా మెప్పించని ఈ దర్శకుడికి కాస్త టెక్కు ఎక్కువే అంటారు. ఇక నాని లాంటి స్టార్ హీరో కమ్ ప్రొడ్యూసర్ నే లెక్క చేయలేదు అంటే ఇంక ఇతర నిర్మాతలు మాత్రం పట్టించుకుంటారా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *