Box Office Breaking News Latest News Movies

ఆ సినిమాలో శివగామి ఉండి ఉంటేనా…?

బాహుబలి.. ఈ సినిమాలో ప్రతి ఆర్టస్టుకూ ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. అయితే అందరి గుర్తింపు కంటే భిన్నమైన రికగ్నిషన్ వచ్చింది శివగామి పాత్ర చేసిన రమ్యకృష్ణ. అప్పటి వరకూ తనుకున్న ఇమేజ్ కు భిన్నమైన పాత్ర కావడంతో పాటు.. ఆ పాత్రకు తగ్గట్టుగా.. ఇంకా చెబిే అంతకు మించిన హుందా తనాన్ని నటనతో ఆపాదించింది. ప్రభాస్, రానాల తల్లిగా.. నా మాటే శాసనం అంటూ శివగామి హూంకరిస్తే.. ఆ పాత్రలు కామ్ గా ఉంటే.. ఆడియన్స్ భళా అనేశారు. అందుకే ‘ఆ స్థాయి’ పాత్రలకు ఇప్పుడు రమ్యకృష్ణ మోస్ట్ వాంటెడ్ గా మారింది. అదే టైమ్ లో వేరెవరైనా ఈ తరహా పాత్రలు చేసినా.. అరె.. ఈ క్యారెక్టర్ రమ్యకృష్ణ చేసి ఉంటేనా అనేలానూ మార్చింది. అలాంటి తను ఓ బిగ్గెస్ట్ సినిమాను మిస్ చేసుకుంది.

బాహుబలి తర్వాత సౌత్ నుంచి వెళ్లి ఇండియాను షేక్ చేసిన మరో సినిమా ‘కెజిఎఫ్’. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడ సీక్వెల్ గా ‘కెజిఎఫ్ చాప్టర్ -2’ వస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో రమ్యను అడిగారట. కానీ తను ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందట. ఆ పాత్రనే ఇప్పుడు బాలీవుడ్ మాజీ హీరోయిన్ రవీనాటాండన్ తో చేయిస్తున్నారు. మరి రవీనా, రమ్యల టాలెంట్ ను పోల్చి చూసినా.. ఈ పాత్ర రమ్య చేసి ఉంటే ఖచ్చితంగా రేంజ్ మారి ఉండేదే అనిపిస్తుంది. మొత్తంగా ఈ విధంగా తను అనివార్యంగా ఆ పెద్ద సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *