Box Office Breaking News Latest News Movies

‘భీష్మ’ మొదలుపెట్టాడు

నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్స్ ఉన్నాయి. వచ్చిన  పాటలు ఆకట్టుకున్నాయి. టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది.  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీతో నితిన్ ఖచ్చితంగా హిట్ కొడతానే సంకేతాలు మొదట్నుంచీ కనిపిస్తున్నాయి. ఇక వెంకీ కుడుముల కామెడీ రైటింగ్ కెపాసిటీ ఏంటో ఫస్ట్ మూవీతోనే తేలిపోయింది. ఇటు రష్మిక కూడా లక్కీ లెగ్ లా మారింది. సో ఎలా చూసినా సినిమాకు అన్నీ పాజిటివ్సే కనిపిస్తున్నాయి.

మొత్తంగా విడుదలకు మరో తొమ్మిది రోజులే ఉంది కాబట్టి టీమ్ ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఇప్పటికే నితిన్ సోషల్ మీడియాలో మూడు రోజులుగా సందడి చేస్తున్నాడు. ఇక అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా డిఫరెంట్ ప్లాన్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగొచ్చు. చీఫ్ గెస్ట్ లు ఎవరనేది ఇప్పటికే తేలిపోయిందంటున్నారు. కానీ ఎవరు వస్తున్నారో చెప్పడం లేదు.

మరోవైపు సినిమా కేవలం లవ్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. ఇందులో ఇన్ బిల్ట్ గా రైతులకు సంబంధించిన సమస్యల ప్రస్తావన కూడా ఉంటుందనేది రీసెంట్ గా వినిపిస్తోన్న వార్త. అయితే రెగ్యులర్ తరహాలో కాకుండా  ఆర్గానిక్ ఫామింగ్ రూపంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయనేది వార్త. మొత్తంగా నితిన్ ఇక ఈ వారం రోజులూ ప్రమోషన్స్ తో సందడి చేస్తూ మీడియాకు పూర్తి అందుబాటులోకి రాబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *