Big Story Box Office Breaking News Latest News Movies

ఇదంతా విజయ్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా..?

పెళ్లిచూపులుకు ముందు వరకూ తెలుగు సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కొంత వరకూ తగ్గారు అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకు తీరాల్సిన నిజం. ఆ సినిమాతో అన్ని వయసుల ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించిన సత్తా విజయ్ దేవరకొండది. ఇక ఒకే టీజర్ తో ఇండస్ట్రీతో పాటు యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు అర్జున్ రెడ్డితో. ఇక ట్రైలర్ తర్వాత అర్జున్ రెడ్డితో అప్పటి వరకూ ఉన్న ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని రేంజ్ లో ముందు రోజు రాత్రే వందల షోస్ తో ప్రీమియర్స్ పడ్డాయి. అటుపై విజయ్ ని టాలీవుడ్ కు నయా స్టార్ గా మెగాస్టారే చెప్పాడు. ఇక గీత గోవిందంతో కమర్షియల్ గానూ సత్తా చాటాడు. నటుడుగా విజయ్ కి వంక పెట్టలేం. కానీ వ్యక్తిగతంగా అతని వేదికల ప్రవర్తనే కొంతమందికి అతన్ని దూరం చేసింది.

రెండు ఫ్లాపుల తర్వాత కూడా విజయ్ క్రేజ్ తగ్గలేదు అనేదానికి నిదర్శనం.. వరల్డ్ ఫేమస్ లవర్ అడ్వాన్స్ బుకింగ్సే. అయితే ఆ స్థాయిలో అది బయటకు కనిపించడం లేదు. పైగా ఈ సినిమాకు అస్సలు బజ్ రావడం లేదు అనేది కూడా నిజమే. అడ్వాన్స్ బుకింగ్స్ అయినంత మాత్రాన అది ముందే గొప్ప సినిమాగా డిసైడ్ అయిపోదు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంటె గా కనిపించడం లేదు. ‘సిక్స్ కొట్టాన బాల్ గాలిలో ఉంది’ వంటి డైలాగ్స్ అతన్నుంచి రావాల్సింది కాదు. ఆ కారణంగానే వరల్డ్ ఫేమస్ లవర్ కూడా అర్జున్ రెడ్డిలా అన్ని వర్గాల ప్రేక్షకుల సినిమా కాదేమో అనే అనుమానాలకు తావిచ్చింది. ట్రైలర్ కూడా కన్ఫ్యూజింగ్ గా కనిపించింది.

మొత్తంగా విజయ్ దేవరకొండ ఇతర హీరోలకు ప్రమోషన్ చేసినంతగా తన సినిమా విషయంలో చొరవ తీసుకోవడం లేదు అనేది నిజం. మరో రెండు మూడు రోజుల్లో సినిమా అనగా ఇంత తక్కువ బజ్ ఉండటం ఖచ్చితంగా అది విజయ్ దేవరకొండ స్వయంకృతాపరాధమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *