Box Office Breaking News Latest News Movies

ఎన్టీఆర్ కు రాజకీయాలు అవసరమా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగులో తనంత పోటెన్సియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ లేడనే అంటారు. ఆ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఏ పాత్రైనా చేయగల ఉన్నవాడనే కదా అర్థం. ఒకప్పుడు ఊరమాస్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. తర్వాత ఫ్యాక్షన్ లో యాక్షన్ మిక్స్ చేసి ఓ దశలో బోర్ కొట్టించాడు. ఆ ట్రెండ్ నుంచి బయటకు వచ్చి.. వైవిధ్యమైన సినిమాలతో దమ్ము చూపించాలనుకున్నా అవన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన రభస చేయలేకపోయాయి. మొత్తంగా టెంపర్ నుంచి మారిపోయిన బుడ్డోడు తర్వాత బుల్డోజర్ లా మారాడు. చేసే ప్రతి సినిమా కమర్షియల్ గా విజయాలు సాధిస్తున్నాయి. రికార్డుల మేటర్ పక్కన బెడితే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఇదే టైమ్ లో మళ్లీ ఒకే తరహా పాత్రలతో అంటే గంభీరమైన క్యారెక్టర్స్ తో మూసగా వెళుతున్నాడా అని కూడా అనిపిస్తుంది. ఈ టైమ్ లో అతన్నుంచి ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తే చూడాలనేది అభిమానుల కోరిక.

అయితే ఫ్యాన్స్ కోరిక కంటే తనకు విజయమే ఇంపార్టెన్స్ అనుకున్నాడేమో కానీ.. మొత్తంగా ఎన్టీఆర్ నెక్ట్స్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను పొలిటికల్ కంటెంట్ తో చేస్తున్నాడు అంటున్నారు. కానీ దాదాపు ఇలాంటి కంటెంట్ తోనే చేసిన అరవింద సమేత అభిమానులకు సైతం పూర్తి స్థాయిలో నచ్చలేదు. ఈ టైమ్ లో మళ్లీ ఓ సీరియస్ సబ్జెక్ట్ అంటే ఇంకా కష్టం.. ఖచ్చితంగా చెబితే త్రివిక్రమ్ తరహా సినిమా.. అంటే అతనికి ఏది బలం అని ఆడియన్స్ నమ్ముతున్నారో.. ఆ బలమైన కంటెంట్ లో ఎన్టీఆర్ చూపిస్తే చూడాలనుకుంటున్నారు. అది దాటి రాజకీయాలు అంటూ.. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అంటూ రాజకీయ కథలు చేయాలనుకుంటే మళ్లీ అది ఎన్టీఆర్ కు వ్యక్తిగతంగానూ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. సో.. పొలిటికల్ సబ్జెక్ట్ కంటే ఏదైనా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బెటరేమో..  ఓ సారి ఆలోచించుకోండి ‘స్వామీ’..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *