Big Story Box Office Breaking News Latest News Movies

చరణ్, ఆచార్య, నక్సలైట్ .. ఏదో తేడా కొడుతోందే..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ కొరటాల శివతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందనే వార్తలు వచ్చాయి. త్రిష హీరోయిన్ గా అని చెప్పిన ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అని గతంలోనే చెప్పారు. అలాగని ఇదేమీ గెస్ట్ రోల్ కాదు. చరణ్ కెరీర్ లోనే బెస్ట్ రోల్స్ లో ఒకటవుతుంది అనేది లేటెస్ట్ వెర్షన్. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ నక్సలైట్ ఇప్పటి వాడు కాదు. ఆ ఉద్యమం ఉధృతంగా ఉన్న 80ల చివర 90 కాలంలో ఉన్న పాత్రట. అంటే అప్పటికి చిరంజీవి వయసును కవర్ చేయడం కష్టం కాబట్టే ఆ పాత్రను అంటే చిరంజీవి చిన్నప్పటి పాత్రనే రామ్ చరణ్ తో చేయిస్తున్నారు. అంటే రామ్ చరణ్ నక్సలైట్ గా కనిపిస్తాడన్నమాట. అంత వరకూ ఇది ఎగ్జైటింగ్ పాయింటే. కానీ..

సినిమా టైటిల్ ‘ఆచార్య’ అని వినిపిస్తోంది. అలాగే మారిన ఈ నక్సలైట్ దేవాలయాల కోసం పోరాటం చేస్తాడు అన్నారు. నక్సలైట్ అండ్ దేవాలయాలు పూర్తిగా విరుద్ధమైన అంశాలు. అలాగే టైటిల్ ను బట్టి చూస్తే ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథగానూ కనిపిస్తోంది. అప్పుడు మళ్లీ నక్సలైట్ ఏంటీ అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. మొత్తంగా ‘మాజీ నక్సలైట్’ అనేది ఖచ్చితంగా ‘కమర్షియల్’ గా వర్కవుట్ అయ్యే అంశమే. కాకపోతే రామ్ చరణ్, నక్సలైట్, ఆచార్య వంటి విరుద్ధమైన అంశాలే తేడా అనిపిస్తున్నాయి. మరి వీటిపై దర్శకుడు కొరటాల శివ ఏదైనా క్లారిటీ ఇస్తాడా లేక రాజమౌళిలా.. సినిమా వచ్చే వరకూ ఎవరి ఊహలకు వాళ్లను వదిలేస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *