Box Office Breaking News Latest News Movies

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తేజ సినిమా ఇదే..?

‘ఆర్ఆర్ఆర్’ ఈ టైటిల్ వినగానే ఇది రాజమౌళి టైటిల్ కదా అనిపిస్తుంది కదా.. కానీ ఈ టైటిల్ తో తేజ కూడా ఆల్రెడీ ఓ టైటిల్ రిజిస్టర్ చేశాడు. కాకపోతే దీనికి ఫుల్ ఫామ్ ఉంది. రాజమౌళి సినిమాకు లేదు అంతే తేడా. కానీ టైటిల్ సేమ్ టు సేమ్. ఇంతకీ తేజ టైటిల్ ఏంటనే కదా మీ డౌట్. రాక్షస రాజు రావణుడు(ఆర్ఆర్ఆర్). ప్రస్తుతం విరాట పర్వం, హాథీ మేరే సాథీ అనే సినిమాలు  చేస్తున్న రానా కొంత కాలం తర్వాత ఈ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. రానా తర్వాత చేయబోయే సినిమా కూడా తేజ గతంలోనే అనౌన్స్ చేశాడు తేజ. గోపీచంద్ హీరోగా రూపొందే ఈ మూవీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి లేటెస్ట్ గా రిజిస్టర్ కూడా చేయించాడు.

రానా సినిమా వచ్చే నెలలో అఫీషియల్ గా ప్రారంభం కావొచ్చు. ఆ తర్వాతే గోపీచంద్ సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమాకు గోపీతో పాటు తేజ ఇమేజ్ కు భిన్నమైన టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ‘‘అలివేలు వెంకటరమణ’’. ఇదే ఆ టైటిల్. ఇప్పటికే యాంగ్రీ మేన్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ కు ఇది సాఫ్ట్ టైటిల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనోడు వీర ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏ టైటిల్ అయినా దర్శకుడికే వదిలేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుపుకుంటోన్న ఈ మూవీతో గోపీచంద్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ.. గతంలో అతను హీరోగా ఫెయిల్ అయినప్పుడు తేజనే విలన్ గా రేంజ్ మార్చాడు. మరి ఇప్పుడు హీరోగా మళ్లీ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి మళ్లీ బ్రేక్ ఇస్తాడా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *