Big Story Box Office Breaking News Latest News Movies

 ప్రభాస్ కోసం చెరువును ‘సెట్’ చేశారు…

ఆర్ట్ డైరెక్టర్ తలచుకుంటే సృష్టించలేనిది ఏముంటుంది. కాకపోతే అతని ఆలోచనకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు కూర్చే నిర్మాతలు ఉండాలి అంతే. ఇప్పటికే మన ఆర్ట్ డైరెక్టర్స్ ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరులో కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ వేసి ఔరా అనిపించారు. ఇప్పుడు ప్రభాస్ కోసం ఏకంగా చెరువునే సెట్ చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మామూలుగా అయితే ఇలాంటి చెరువులను గ్రాఫిక్స్ లో సెట్ చేస్తారు. కానీ వీళ్లు మాత్రం సెట్టింగ్ గా వేశారు. రాధాకృష్ణ డైరెక్షన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు.

రవీందర్ రెడ్డి అనే ప్రొడక్షన్ డిజైనర్ ప్రభాస్ సినిమా కోసం ఏకంగా చెరువును తవ్వించాడు. అందులో నీళ్లు నింపి, ప్రభాస్, పూజా హెగ్డేలపై సీన్స్ చిత్రీకరిస్తున్నారిప్పుడు. ఏదేమైనా చెరువును సెట్ చేయడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ చెరువును సినిమా తర్వాత పూడుస్తారా లేక ముందు ముందు అలా పర్మనెంట్ గా మరిన్ని సినిమాలకు వాడతారా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *