Big Story Box Office Breaking News Latest News Movies

 మెగాస్టార్ విలన్ ఫిక్స్ అయినట్టేనా..?

కొందరు కొన్ని పాత్రలు చేస్తున్నారంటే అంచనాలు పెరుగుతాయి. అలాంటిది వెటరన్ స్టార్స్ తమ పాత పాత్రల్లో కనిపించబోతున్నారంటే ఖచ్చితంగా ఆసక్తీ పెరుగుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నాడు అంటూ చాలా రోజులుగా వినిపిస్తోన్నా ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు. కానీ తాజాగా ఈ వార్త నిజమే అని వినిపిస్తోంది. ఒకప్పుడు మెగాస్టార్ విలన్ గా చేశాడు. ఇటు మోహన్ బాబు విలన్ గానే పరిచయం అయ్యాడు. విలన్ గానే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. విలన్ గా దాదాపు దశాబ్ధంన్నర పాటు నటించిన తర్వాతే మోహన్ బాబు హీరోగా మారాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అటు హీరోగానూ మంచి పొజిషన్ తెచ్చుకున్నాడు మోహన్ బాబు. అప్పటి నుంచి విలన్ గా చేయలేదు.

అయితే మోహన్ బాబు విలన్ గా చిరంజీవి హీరోగా నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కొండవీటి దొంగ, కొదమ సింహం వంటి సినిమాల్లో ఈ ఇద్దరి జోడీ అదిరిపోతుంది. మొత్తంగా ఇన్నాళ్ల తర్వాత వారి పాత పాత్రల్లో మరోసారి కొరటాల రీ లాంఛ్ చేయబోతున్నాడనే అంటున్నారు.

మామూలుగానే కొరటాల సినిమాల్లో విలన్ పాత్రలు బలంగా ఉంటాయి. ఇక మోహన్ బాబు వంటి నటుడుతో చేయించాలి అంటే ఇంకా బలమైన పాత్రయ్యే ఉంటుంది. అతను ఒప్పుకోవడానికి ఇదీ ఓ కారణం అనుకోవచ్చు. మొత్తంగా మెగా కలెక్షన్ కింగ్ కాంబినేషన్ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *