Big Story Box Office Breaking News Latest News Movies

అభిమాని కుటుంబానికి 10లక్షలు ఇచ్చిన రామ్ చరణ్

మెగా అభిమాని అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు నూర్ మహ్మద్. చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ గా బ్రతికినంత కాలం పనిచేశారు. మెగా ఫ్యామిలీపై అంతులేని అభిమానం పెంచుకున్న ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చిన అందరు హీరోలకు సమానమైన గౌరవాన్ని ఇస్తూ వస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన హఠాత్తుగా మరణించారు. ఆ సమయంలో మెగా హీరోలంతా వెళ్లి ఆయన కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అదే సందర్భంలో నూర్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీని రామ్ చరణ్ నెరవేర్చాడు.
తాజాగా ఆయన ఇంటికి వెళ్లి మరీ చరణ్ 10లక్షల రూపాయలను అందజేశాడు. అంతేకాక ముందు ముందు ఏ అవసరం వచ్చినా ఆ కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పి మరీ వచ్చారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లో గంటసేపు వరకూ రామ్ చరణ్ ఉండటం విశేషం. కుటుంబం సభ్యులందరితోనూ మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *