Big Story Box Office Breaking News Latest News Movies

పవన్ సినిమాలోనా.. అంతలేదు –  అలీ

పవన్ కళ్యాణ్, అలీ.. ఈ ఇద్దరి మధ్యా ఉన్న సినిమా స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో విషయాల్లో అలీని పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానిస్తాడు. అలాగే తన ప్రతి సినిమాలోనూ అలీ ఉండేలా చూసుకుంటాడు పవన్. అయితే పొలిటికల్ గా ఎవరి దారి వారుగా మారిన తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. అలీ తనను వదిలేసి వైఎస్ జగన్ పార్టీ వైఎఎస్ఆర్సీపీలో చేరడం పట్ల ఓ దశలో ‘అలీకి నేను లైఫ్ ఇచ్చా’అంటూ పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చేసిన ప్రసంగానికి అలీకి మండింది. దీంతో ఓ వీడియో చేసి మరీ పవన్ గాలి తీసేశాడు. ‘పవన్ కళ్యాణ్ నువ్వు ఇండస్ట్రీకి రాక ముందే నేను సెటిల్డ్’ అంటూ అలీ ఇచ్చిన కౌంటర్ కు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పవన్ అభిమానులు అలీని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. బూతులు తిట్టారు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. అలీని తన సినిమాలోకి తీసుకోమన్నాడనీ.. ఆ విషయం దర్శకుడు కూడా అలీకి చెప్పాడనీ.. అలీ ఒప్పుకున్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వాటిని అలీ ఖండించాడు.
పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని తననెవరూ అడగలేదని.. ఇంత వరకూ అలాంటి వార్త నా వరకూ రాలేదని తేల్చేశాడు. అయితే ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం నటిస్తానని చెప్పాడు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. అందువల్ల సినిమాలో ఆఫర్ వస్తే నేను నటిస్తాను అని చెప్పాడు. దీంతో ఇప్పటి వరకూ ఈ ప్రాపగాండా ఎవరు చేసి ఉంటారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే తరచి చూస్తే ఈ వార్తలతో మరోసారి పవన్ ను హీరోను చేయాలని అతని అభిమానులే చేసి ఉంటారనే మాటలూ వినిపిస్తున్నాయి. సో.. అదీ మేటర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో అలీ ఇప్పటి వరకైతే లేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *