Big Story Box Office Breaking News Latest News Movies

‘సరాసరి గుండెల్లోకే’ అంటోన్న నితిన్

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మరో సాంగ్ విడుదల చేసింది టీమ్. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాట బ్యూటీఫుల్లీ పిక్చరైజ్డ్ గా కనిపిస్తోన్న మెలోడీయస్. ‘ నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా.. ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే’ అంటూ సాగే శ్రీరమణి గీతం   వినగానే ఆకట్టుకునే మెలోడీ.
అస్సలే మాత్రం హడావిడీ కనిపించకుండా హాయిగా సాగే సోలో మెలోడీ అయిన ఈ పాటలో సాహిత్యం అద్భుతంగా కుదిరింది. అలాగే సంగీతం కూడా క్లాసికల్ గా వినసొంపుగా ఉంది.మొత్తంగా నితిన్ కు ఈ సినిమా మొదట్నుంచీ పాజిటివ్ సైన్సే ఇస్తోంది. అటు రష్మిక కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉందీ చిత్రంపై. సో చూస్తోంటే వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ ను భీష్మ పూర్తిగా గట్టెక్కించేలానే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *