Box Office Breaking News Latest News Movies

కొడుకు విషయంలో ఫెయిల్ అయ్యాడా..?

రాజ్ కందుకూరి.. పెళ్లి చూపులు నిర్మాత అనే ట్యాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత మెంటల్ మదిలో మూవీతో మరింత మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నాడు. విజయ్ దేవరకొండ వెలుగులోకి రావడంలో రాజ్ కందుకూరి పాత్ర చిన్నదేమీ కాదు. మొత్తంగా ఇప్పుడు తన కొడుకు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ‘చూసీ చూడంగానే’అనే క్యాచీ టైటిల్ తో వచ్చాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి అనుకున్నంత బజ్ లేదు. అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా పూర్ గానే ఉన్నాయి. పోనీ టాక్ ఏమైనా ప్లస్ అవుతుందా అనుకుంటే అది కూడా లేదు. మొత్తంగా చూసీ చూడంగానే విడుదలైనట్టు కూడా చాలామందికి తెలియకుండా పోయింది.

ఇది ఓ సాధారణ ప్రేమకథే. హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరోయిన్ అతన్ని ప్రేమిస్తుంది. అది తెలియని హీరో తను ప్రేమించిన అమ్మాయి వెంట తిరుగుతూ వెళతాడు. కట్ చేస్తే ఓ రోజు తను మరొకరి మోజులో పడి హీరోకు హ్యాండ్ ఇస్తుంది. ఆ తర్వాత అతన్ని ప్రేమించిన అమ్మాయి మళ్లీ అతని లైఫ్ లోకి వస్తుంది. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ డెవలప్ అయింది.. మళ్లీ వీళ్లు కొత్తగా ప్రేమలో పడ్డారా అనే పాయింట్స్ చుట్టూ అల్లుకున్న ఈ కథ అనుకున్నంతగా అలరించలేకపోయింది.
నటుడుగా శివకు మంచి మార్కులే వేయొచ్చు. ఫస్ట్ మూవీ అయినా ఏ మాత్రం తడబడలేదు. ఇక తమిళ్ 96తో ఫేమ్ అయిన వర్ష బొల్లమ్మ నటన సినిమాకు హైలెట్. శేష సింధూరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతో తన కొడుకుకు సరైన లాంచింగ్ ఇవ్వడంలో రాజ్ కందుకూరి ఫెయిల్ అయినట్టే అంటున్నారు. మరి అది ఎంత వరకూ అనేది వీకెండ్ దాటితే కానీ తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *