Big Story Box Office Breaking News Latest News Movies

  ప్రభాస్ కండీషన్స్ మామూలుగా లేవుగా..?

ప్రభాస్ .. ప్రస్తుతం జాన్ సినిమా షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. రీసెంట్ గా ప్రారంభం అయిన షూటింగ్ కు కొంత టెంపరరీ బ్రేక్ పడినా.. మళ్లీ యధావిధిగా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందే ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాలి. 1960స్ లో యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తిగా ప్రభాస్ శైలికి భిన్నంగా సాగుతుందని ముందు నుంచీ చెబుతున్నారు. అంటే ఫైట్లూ గట్రా ఉండవన్నమాట. కేవలం ఓ ప్యూర్ లవ్ స్టోరీగానే కనిపిస్తుంది.

అయితే సాహో ఫ్లాప్ తర్వాత ఆ ఎఫెక్ట్ ఈ మూవీపై పడింది. దీంతో బడ్జెట్ లో భారీ కోతలు పెట్టారు. అందులో భాగంగా ముందు యూరప్ లో చేయాలనుకున్న షూటింగ్ ఇండియాకే షిఫ్ఠ్ చేశారు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 25కు పైగా సెట్స్ వేశారు. ఆ సెట్స్ లోనే షూటింగ్ చేయబోతున్నారు. రీసెంట్ గా హీరో బంగ్లాకు సంబంధించిన లుక్ తోనే షూటింగ్ ప్రారంభం అయిందనే విషయాన్ని చెప్పారు.  మరోవైపు అన్ని సెట్స్ కు ప్రభాస్ దగ్గరుండి పర్యవేక్షించుకుంటున్నాడట. దగ్గరుండి అంతా చూసుకుంటున్నాడట.

అయితే సెట్స్ చాలా ఉణ్నాయి కాబట్టి.. షూటింగ్ టైమ్ లో ఎవ్వరికీ మొబైల్ ఫోన్ కు అనుమతి లేదని చెప్పారు. ఎంత పెద్ద స్టార్ అయినా, టెక్నీషియన్ అయినా షూటింగ్ పరిసరాల్లోకి మొబైల్ ను అనుమంతించేది లేదని ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయంలో ప్రతి నిమిషం మానిటరింగ్ చేయడానికి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట. ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్ పిక్స్ లీక్ అవుతూ ఆయా చిత్రాల టీమ్స్ కు షాక్ ఇస్తున్నాయి. అందుకే ప్రభాస్ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నాట్ట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *