Box Office Breaking News Latest News Movies

వెంకీ దర్శకుడికి అవమానమా..? ఆమోదమా.. ?

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురణ్ సినిమాకు రీమేక్ ఇది. సురేష్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ కూడా ప్రారంభం అయిన ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. అవేంటో తెలిస్తే ఈ దర్శకుడు శ్రీకాంత్ కు అది అవమానమా లేక గత్యంతరం లేని ఆమోదమా అనేది అర్థం కాకుండా మిగిలిపోతుందేమో.
అసురణ్ సినిమా క్యాస్ట్ బేస్డ్ మూవీ. అగ్రవర్ణాల దాష్టీకాలకు ఎదురుతిరిగిన యువకుడైన కొడుకును పోగొట్టుకున్న ఓ సాధారణ తండ్రి కథ. ఎంత హృద్యంగా ఉంటుందో అంద యాక్షన్ కూడా ఉంటుంది. అయితే శ్రీకాంత్ కు గతంలో యాక్షన్ సినిమాలు తీసిన అనుభవం లేదు. సెంటిమెంట్ ను పండించడంలో మాత్రం పట్టుంది. అందుకే యాక్షన్ పార్ట్ చిత్రీకరణతో పాటు సినిమా బాగా వస్తుందా లేదా అనేది చూసుకోవడానికి వెంకీమామ దర్శకుడు బాబీని కూడా రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. ఒకే సినిమాను ఇద్దరు డైరెక్ట్ చేయడం వేరు. ఆ సినిమాలోని ఒక పార్ట్ కు మరో దర్శకుడు యాప్ట్ కాదని మరో దర్శకుడికి అప్పగించడం వేరు. ఈ రెండో దాని వల్ల మొదటి దర్శకుడి ఎబిలిటీపై అనుమానాలు వస్తాయి. అతనూ అవమానంగా ఫీలవుతాడు.

కాకపోతే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలను పట్టించుకునేవారు లేరు. అలాంటిది పిలిచి మరీ సినిమా ఇచ్చాడు సురేష్ బాబు. దీంతో అతనూ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఇటు బాబీ కూడా వెంకీమామతో కమర్షియల్ గా మంచి విజయమే ఇచ్చినా మరో హీరో అతని గురించి ఆలోచించడం లేదు. దీంతో ఇది ‘ఒన్ మూవీ టూ డైరెక్టర్స్’ లా లేదూ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *