Big Story Box Office Breaking News Latest News Movies

మహేష్ కు మళ్లీ ఓకే చెబుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆఫర్ వస్తే కాదనే హీరోయిన్లుంటారా..? అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఆఫర్ వచ్చినా అవతలి బ్యూటీస్ కు డేట్స్ కూడా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు కియారా అద్వానీ విషయంలో ఇవే డౌట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తను ఫస్ట్ మహేష్ మూవీ భరత్ అనేనేనుతోనే పరిచయం అయింది. ఆ తర్వాత వినయవిధేయరామలో కనిపించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమా ఒప్పుకోలేదు. ఇదే టైమ్ లో బాలీవుడ్ లో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో తను అక్కడ సూపర్ బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటిచేందుకు సిద్ధమవుతోంది.

ఇక సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు మరోసారి మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు మహేష్ బాబు. అతను తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు వంశీ. అందులో భాగంగానే మరోసారి కియారను మహేష్ సరసన తీసుకునే ప్రయత్నాలు చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. దీంతో మహేష్ భార్య నమ్రత రంగంలోకి దిగిందట. ప్రస్తుతం తను  కియారాను ఈ సినిమాలో పార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తోందని టాక్. అటు వెకేషన్ లో ఉంటూనే ఇటు బిజినెస్ లోనూ స్మార్ట్ గా ఉంటోందట నమ్రత.

అయితే కియారా ఇప్పుడు బాలీవుడ్ లో లక్ష్మీ బాంబ్, ఇందూ కీ జవానీ, షేర్ షా, భూల్ భులాయియా వంటి సినిమాలతో బిజీగా ఉంది. మరి ఇంత బిజీలో ఇప్పుడు మహేష్ కు డేట్స్ ఇవ్వగలుగుతుందా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *