Big Story Box Office Breaking News Gallery Latest News Movies

సరిలేరు వర్సెస్ అల .. ద విన్నర్ ఈజ్ ..

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద బాగా తగ్గిపోయాయి. అలాగని అస్సలు లేవు అని కాదు. కానీ నిన్నటి వరకూ నేనంటే నేను అంటూ పోటీలు పడ్డ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములోతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్సే కాదు.. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. బుక్ మై షోలో అల సినిమాకు అదిరిపోయేలా బుకింగ్స్ ఉన్నాయి. కానీ సరిలేరుకు అంత లేదు. ఇటు సింగిల్ స్క్రీన్స్ లోనూ మహేష్ కంటే బన్నీకే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయనేది ట్రేడ్ రిపోర్ట్.

మామూలుగా ఈ రెండు సినిమాలూ శనివారంతో వందకోట్లు కొల్లగొట్టాయి. కానీ సరిలేరుకు ముందస్తు బుకింగ్స్ తగ్గిపోయాయి. కానీ అల వైకుంఠపురములో సినిమాకు మాత్రం మరో రెండు మూడు రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయి ఉన్నాయి. దీంతో అలాగే అల్లు అర్జున్ సినిమా కలెక్షన్స్ పరంగానూ టాక్ పరంగానూ ఓవర్శీస్ లో మహేష్ ను కొట్టేసింది. ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్నదాన్ని బట్టి.. అల వైకుంఠపురములో రంగస్థలం రికార్డ్స్ ను దాటేయొచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి 104కోట్లకు పైగా షేర్ వచ్చింది. మరో మూడు రోజుల వరకూ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఈజీగా 140 కోట్ల వరకూ రాబట్టొచ్చు అంటున్నారు. మొత్తంగా ఈ రెండు సినిమాలనూ కంపేర్ చేసి చూస్తే ఈ సారికి మహేష్ పై అల్లు అర్జున్ దే పై చేయిగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *