Box Office Breaking News Latest News Movies

పండగపూట ఇంప్రెస్ చేసిన ‘భీష్మ’

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఛలోతో టాలీవుడ్ ను ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ ల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. సంక్రాంతికి కాస్త ముందుగా వచ్చిన భీష్మ ట్రైలర్ వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుంటోంది. ఈ సారి పూర్తిగా నితిన్ పైనే కాన్ సెంట్రేట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఫన్ ఫుల్ గా అనిపించింది. ఇక ఏ పాత్రైనా ఆకట్టుకునే సంపత్ ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా కనిపిస్తున్నాడు. సినిమాలో నితిన్, సంపత్ ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయని అర్థం అవుతోంది. అతనికి తోడు బ్రహ్మాజీ కూడా ఉన్నాడు.

ఇక నితిన్, రష్మికల మధ్య మంచి కెమిస్ట్రీ పండుతోందని కూడా తెలుస్తోంది. అలాగే టీజర్ లో డైలాగ్స్ చూస్తే వెంకీ మరోసారి ఓ రేంజ్ లో నవ్వులు పూయించబోతున్నాడని అర్థం అవుతోంది. టీజర్ చివర్లో చెప్పిన చిన్న డైలాగ్ ‘నా అదృష్టం ఆవగింజ అంత అయితే దురదృష్టం దబ్బకాయంత ఉంది’ అనే మాటలను హీరో క్యారెక్టర్ తెలుస్తోంది. మొత్తంగా పండగ సందర్భంగా వచ్చిన భీష్మ టీజర్ వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుంటోంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే నితిన్ ఈ యేడాదిని గ్రాండ్ గా ఆరంభించినట్టే అవుతుంది. ఫిబ్రవరి 21న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *