Box Office Breaking News Latest News Movies

యాంకర్ సుమను కంట్రోల్ చేయాల్సిందేనా..?

సుమ.. తెలుగమ్మాయి కాకపోయినా.. అందమైన తెలుగులో మాట్లాడుతూ.. ఆకట్టుకుంటోంది. ఒక దశాబ్ధానికి పైగా తను లేని షో లేదు.. తను కనిపించని ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు అన్నట్టుగాఓ రేంజ్ లో తనకంటూ  స్ట్రాంగ్ ప్లాట్ ఫామ్ సెట్ చేసుకుంది. కానీ ఏదైనా ఎక్కువైతే బావుండదు అనేదానికి సుమ ప్రత్యక్ష్య ఉదాహరణ. నిజమే.. కొన్నాళ్ల క్రితం సుమ గళగళ మాట్లాడితే ఆ ఈవెంట్ కో లేదా షోకో అందం వచ్చేది. కానీ ఇప్పుడు ఇరిటేషన్ వస్తుందనేది చాలామంది అభిప్రాయం. వేదికపై ఎవరు మాట్లాడుతున్నారు అనే మినిమం సెన్స్ లేకుండా సుమ ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో మరింతగా ఇరిటేట్ చేస్తోంది సుమ. ప్రతి విషయానికి సెటైర్ వేయడానికి చూపించే ఉత్సాహం సెన్సిబుల్ గా మాట్లాడ్డంలో చూపించడం లేదు. ఇంక రాజమౌళి ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ అయితే చెప్పక్కర్లేదు.

ఇక మాటలతో ఆకట్టుకోవడం అంత సులభం కాదు. ఆ విషయంలో సుమను మించిన వారు లేరు అని కూడా చెప్పాల్సిందే. మరి ఇదే విషయంలో తనలో కాన్ఫిడెంట్ ను కాస్త ఓవర్ చేసిందో ఏమో కానీ.. ఈ మధ్య తను తరచూ విసిగిస్తోంది. ఏ గెస్ట్ మాట్లాడుతున్నా.. మధ్యలో దూరిపోవడం.. తనకు అసందర్భంగా మాట్లాడ్డం చేస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రష్మిక మందన్నాతో తను చెప్పిన మాట ఖచ్చితంగా తన ఓవర్ యాటిట్యూడ్ కు పరాకాష్టగానే చెప్పాలి. నిజమే.. రష్మిక మాట్లాడే సందర్భంలో ‘ఇక్కడ ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకోవాలి’ అంటూ ఆమె అన్న మాటలు ఇండస్ట్రీ మొత్తానికి వర్తిస్తాయి. మరి ఇన్నాళ్లుగా తను చేస్తున్నది కూడా ఎవడితో డబ్బా కొట్టడమే కదా.. అంటే తను డబ్బు తీసుకునే కదా డబ్బాలు కొడుతోంది. సో..ఓ డబ్బా రాణి కూడా డబ్బాల గురించి మాట్లాడుతుంటేనే ఈ మధ్య అందరికీ చిరాకు వేస్తోంది. అందుకు ఆమె చేసిన ఇంటర్వ్యూస్ కానీ ఫంక్షన్స్ కు సంబంధించిన వీడియోస్ యూ ట్యూబ్ లో ఉణ్నప్పుడు కింద కమెంట్స్ లో చూస్తే ప్రతి ఒక్కరూ సుమనే తిడుతున్నారు అనేది నిజం. ఏదేమైనా సుమకు ఆల్టర్నేషన్ వీలైనంత త్వరగా చూసుకుంటే మంచిది. లేదంటే ఈ ఇరిటేషన్ ను భరించడం ఆడియన్స్ వల్ల కాదు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. డిగ్నిటీ లేని ప్రతిభ ఎప్పుడూ ఆకట్టుకోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *