Big Story Box Office Breaking News Latest News Movies

అల్లు అర్జున్ సెటైర్ జగన్ పైనేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ నెల 12న విడుదల కాబోతోన్న ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ లా కాకుండా మ్యూజికల్ నైట్ అంటూ చేసి కొత్త ట్రెండ్ కు తెరలేపాడు. ఇక ఈ ఫంక్షన్ లో కాస్త ఎక్కువ సేపు మాట్లాడిన బన్నీ.. ఎన్నడూ లేని విధంగా.. తనే చెప్పినట్టుగా ఫస్ట్ టైమ్ తన తండ్రి అల్లు అరవింద్ ను తెగ పొగడ్తల్లో ముంచెత్తాడు. తన తండ్రి ఎంత గొప్పవాడు అనేది తను తండ్రి అయ్యాకే తెలిసింది అంటూ ఫస్ట్ టైమ్ ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్ల వెంట నీళ్లు చూసి అరవింద్ సైతం ఓ రకంగా ఇదైపోయాడు. అయితే అంతా బానే ఉంది అనుకుంటోన్న టైమ్ లో అతను చెప్పిన మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎమ్ జగన్ మోహన్ రెడ్డి కోసమే అంటూ ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం ఎత్తేసి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ తెలుగు భాషకు ఏదో అయిపోతోందనే రేంజ్ లో కొన్నాళ్లు ఆందోళనలు జరిగాయి. ఈ టైమ్ లో అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ లో బన్నీ చెప్పిన మాటలు సెటైర్స్ లా ఉన్నాయంటున్నారు.. ‘‘నేను మా నాన్నను డాడీ అని పిలిచాను. కానీ మా పిల్లలు నన్ను నాన్నా అనే పిలుస్తున్నారు. అలా పిలవాలని నేనే చెప్పాను. ఎందుకంటే తెలుగు భాష బావుండాలి. మనమే భాషను, సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లాలి..’’ ఇవే బన్నీ అన్న మాటలు. మరి ఇవి చూస్తే కాంటెంపరరీ అయిన జగన్ నిర్ణయం గుర్తుకు రాక మానదు కదా.. కాకపోతే ఆ మాటలు అంటున్నప్పుడు అల్లు అర్జున్ ఇంటెన్షన్ వేరే. అయితే ఆ ఇంటెన్షన్ ను పట్టించుకుంటారా లేక తమకేది కావాలో అదే తీసుకుని రచ్చ చేస్తారా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *