Box Office Breaking News Latest News Movies

నయా సౌత్ సూపర్ స్టార్ విజయ్

ఏ స్టార్ రేంజ్ అయినా డిసైడ్ చేసేది.. అతని సినిమాలు సాధించే కలెక్షన్స్.. అతను తీసుకునే రెమ్యూనరేషన్. వీటికి తోడు అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఓ కారణమవుతుంది. అలా చూస్తే ఇన్నేళ్లైనా ఇప్పటి వరకూ సౌత్ మొత్తానికి సూపర్ స్టార్ అంటే ఒన్ అండ్ ఓన్లీ రజినీకాంత్ మాత్రమే. కానీ లేటెస్ట్ గా లెక్కలు మారాయి. యస్.. సౌత్ కు కొత్త సూపర్ స్టార్ వచ్చాడు. అతను మరెవరో కాదు.. ఇళయదళపతి విజయ్ .. యస్.. విజయ్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ ను శాసిస్తున్నాడు. అతన్నుంచి విడుదలైన ప్రతి సినిమా వంద కోట్లకు పైగా కొల్లగొడుతోంది. రీసెంట్ గా వచ్చిన బిగిల్ ఏకంగా 200కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు ఓ ఐదారేళ్లుగా విజయ్ కి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. వీటికి తోడు కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ కూడా అతనే. అందుకే అతనే ఇప్పుడు నయా సూపర్ స్టారా అనుకుంటున్నారా.. అదొక్కటే కాదు. ఆయన రెమ్యూనరేషన్ లో కూడా రిజనీకాంత్ ను మించిపోయాడు.

ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తో‘మాస్టర్’అనే సినిమా చేస్తన్నాడు విజయ్. ఇది అతని 64వ సినిమా. తర్వాత అతను వెట్రిమారన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గా అసురణ్ వంటి బ్లాక్ బస్టర్ తో ఆకట్టుకున్న దర్శకుడే వెట్రిమారన్. ఈ సినిమా కోసం విజయ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే 50 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చిందట నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఇక ఇటు రజినీకాంత్ దర్బార్ కోసం 90 కోట్లు తీసుకున్నాడు. సో.. మారిన లెక్కల ప్రకారం విజయ్ నయా సూపర్ స్టార్ అ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *