Box Office Breaking News Latest News Movies

సెన్సార్ అయింది.. డేట్ పోయింది..

సంక్రాంతి పండగ సందర్భంగా టాలీవుడ్ లో స్టార్ వార్ కు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదని అర్థమౌతోంది. వారం క్రితం వరకూ జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో సినిమాలు విడుదలవుతాయనే ప్లానింగ్ లో ఉన్నారు. కానీ రీసెంట్ గా వచ్చిన కొన్ని డిస్ప్యూట్స్ వల్ల గొడవ పర్సనల్ గా మారడంతో అది కాస్తా సినిమాల రిలీజ్ డేట్స్ పై పడింది. అల వైకుంఠపురములో జనవరి 10నే వస్తామనే దూకుడులో ఉన్నారు. వాళ్లు అలా చేస్తే నేను 9కే వస్తాను అనేలా సరిలేరు టీమ్ కనిపిస్తోంది. ఇక ఈ గొడవను సద్దుమణిచేందుకు తెరవెనక ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ తాజాగా ఈ రెండు సినిమాల సెన్సార్ పూర్తయింది. దీన్ని బట్టి చూస్తే ఇది తెగేదాకా లాగే గొడవలా మారింది అంటున్నారు.

సరిలేరు నీకెవవ్వరు సినిమాకు సెన్సార్ నుంచి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. ఇటు అల వైకుంఠపురములోకు కూడా అదే సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ విషయాన్ని తెలిజయేస్తూ ఈ ఇద్దరూ పోస్టర్స్ వేశారు. కానీ ఈ పోస్టర్స్ లో ముందు అనుకున్న డేట్స్ వేయలేదు. దీన్ని బట్టి వారి మధ్య గొడవ ఇంకా తేలలేదు అనేది తేలిపోతోంది. మరి ఇష్యూ ఎప్పుడు సెటిల్ అవుతుందో కానీ.. త్వరలోనే ఆ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇక ఆ విషయంలో కూడా అభిమానుల మధ్య ట్రోల్స్ వార్ షురూ అవుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ రిలీజ్ డేట్ గొడవకు ఫుల్ స్టాప్ పెడితే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *